చెర్వుగట్టు ఆదాయం రూ.32.77లక్షలు

24 Nov, 2023 02:04 IST|Sakshi
హుండీని లెక్కిస్తున్న ఆలయ సిబ్బంది

నార్కట్‌పల్లి: మండలంలోని చెర్వుగట్టు గ్రామ పంచాయతీ పరిధిలో గల శ్రీపార్వతి జడలరామలింగేశ్వర స్వామి దేవస్థాన హుండీలను గురువారం దేవాలయ సిబ్బంది లెక్కించారు. 58 రోజులకు గాను గట్టు కింద అమ్మవారి హుండీల్లో రూ.3,04,350, గట్టుపైన హుండీల్లో రూ.29,73,428తో కలిపి మొత్తం రూ.32,77,778 ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి నవీన్‌కుమార్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షమొచ్చినప్పుడు, ఎండాకాలంలో భక్తులకు ఇబ్బంది కలగకుండా రేకుల షెడ్లు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయశాఖ డివిజన్‌ పరిశీలకురాలు వెంకటలక్ష్మి, దేవాలయ ప్రధాన అర్చకులు పోతులపాటి రామ లింగేశ్వరశర్మ, సూపరింటెండెంట్‌ తిరుపతిరెడ్డి, సీనియర్‌ అసిస్టెంట్లు ఇంద్రసేనారెడ్డి, శంకర్‌, రవిందర్‌రెడ్డి, జూనియర్‌ అసిస్టెంట్లు శ్రీనివాస్‌రెడ్డి, రాజయ్య, నర్సింహారెడ్డి, వెంకటయ్య, రాజ్యలక్ష్మి, వంశీకుమార్‌ ఉన్నారు.

మరిన్ని వార్తలు