క్రీడలతోనే విద్యార్థుల్లో ఏకాగ్రత

24 Nov, 2023 02:04 IST|Sakshi
జ్యోతి ప్రజ్వలన చేస్తున్న జెన్‌కో డైరెక్టర్‌ అజయ్‌

నాగార్జునసాగర్‌: క్రీడలతోనే శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసంతోపాటు విద్యార్థుల్లో ఏకాగ్రత, నాయకత్వ లక్షణాలు పెరుగుతాయని టీఎస్‌ జెన్‌కో డైరెక్టర్‌ అజయ్‌ అన్నారు. రెండు రోజుల పాటు నిర్వహించనున్న ఉమ్మడి నల్లగొండ పాలిటెక్నిక్‌ కళాశాలల బాలబాలికల అంతర్‌ జిల్లా క్రీడాపోటీలను నాగార్జున సాగర్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలో గురువారం ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రతి క్రీడాకారుడు గెలవాలనే ఆకాంక్షతో ఆడాలన్నారు. తొమ్మిది కళాశాలల నుంచి క్రీడాకారులు హాజరయ్యారు. ఈ కడ్రీడల నిర్వహణకు నాగార్జునసాగర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఐలయ్య కన్వీనర్‌గా, సీనియర్‌ లెక్చరర్‌ కె.ఆంజనేయులు కోకన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్‌, ఇండోర్‌ గేమ్స్‌లు కొన్ని ఫైనల్‌కు చేరినట్లుగా పీడీ జీవి కృష్ణారావు తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జెన్‌కో చీఫ్‌ఇంజనీర్‌ మంగేష్‌ కుమార్‌, రఘురాం పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు