గురువారం సంత.. ట్రాఫిక్‌ చింత

24 Nov, 2023 02:04 IST|Sakshi
మునుగోడులోని సంత రోడ్డులో ట్రాఫిక్‌ జామ్‌ కావడంతో నిలిచిన వాహనాలు

మునుగోడు: నియోజకవర్గ కేంద్రమైన మునుగోడులో గురువారం వచ్చిందంటే ట్రాఫిక్‌ తిప్పలు తప్పడం లేదు. ఆ రోజు సంత నిర్వహిస్తుండటంతో సంతలో వివిధ రకాల వస్తువులు విక్రయించే వ్యాపారులు రోడ్డు మీదకు వచ్చేలా ఇరువైపులా పెడుతున్నారు. దీంతో పెద్ద వాహనం వస్తే ఆ రోడ్డు వెంట వెళ్లడానికి వీలు లేకుండా పోతోంది. ఇదే క్రమంలో మరో వాహనం ఎదురొస్తే ఇక అంతే సంగతులు. తాజాగా గురువారం సంత రోడ్డులో ట్రాఫిక్‌ జామ్‌ కావడంతో 30 నిమిషాల పాటు వ్యాపారులు, వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. సంతలో వ్యాపారం చేసుకునే వారు రోడ్డుపైన వస్తువులు పెట్టి విక్రయించకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు