ఘనంగా అయ్యప్ప పడిపూజ

29 Nov, 2023 02:24 IST|Sakshi
పడి ముట్టిస్తున్న భక్తులు

పెద్దవూర : మండలంలోని బట్టుగూడెంలో కార్తీకపౌర్ణమి సందర్భంగా సోమవారం రాత్రి శ్రీఇష్టకామేశ్వరి, ఆంజనేయ సహిత అయ్యప్ప దేవాలయ ఆవరణలో అయ్యప్ప మహా పడిపూజను ఘనంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన అయ్యప్ప మాలాధారణస్వాములు మహాపడిపూజను తాంత్రిక్‌ రామారావు గురుస్వామి ఆధ్యర్యంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. 18 మెట్లను ఏర్పాటు చేసి జ్యోతులను వెలిగించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కోనసీమకు జిల్లాకు చెందిన రాజేశ్‌ గురుస్వామి బృందం పాడిన భక్తి గీతాలు భక్తులను ఉర్రూతలూగించాయి.గ్రామానికి చెందిన నక్కల విజయేందర్‌రెడ్డి 2500 మంది భక్తులకు అల్పాహారాన్ని ఉచితంగా పంపిణీ చేశారు. బుసిరెడ్డి ఫౌండేషన్‌ చైర్మన్‌ బుసిరెడ్డి పాండురంగారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్‌రెడ్డిలు మహా పడిపూజ కార్యక్రమానికి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మరిన్ని వార్తలు