20న పోచంపల్లికి రాష్ట్రపతి రాక

7 Dec, 2023 10:58 IST|Sakshi

సాక్షి, యాదాద్రి: రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ఈనెల 20న భూదాన్‌పోచంపల్లికి విచ్చేయనున్నారు. కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన థీమ్‌ పెవిలియన్‌ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక్కత్‌ చేనేత వస్త్రాల తయారీ, చేనేత కార్మికులు, పద్మశ్రీ, సంత్‌కబీర్‌ జాతీయ అవార్డు గ్రహీతలతో ముఖాముఖి లో పాల్గొంటారు.

అనంతరం పోచంపల్లి హెచ్‌డబ్ల్యూసీఎస్‌(హ్యాండ్లూమ్‌ వీవర్స్‌ కోఆపరేటివ్‌ సొసైటీ) షోరూం, హెచ్‌డబ్ల్యూసీఎస్‌ సీఎం ఇక్కత్‌ షోరూంను సందర్శించనున్నారు. హైదరాబాద్‌ బొల్లారంలోని రాష్ట్రపతి విడిది భవన్‌ నుంచి ప్రత్యేక విమానంలో ఉదయం 11.10 గంటలకు భూదాన్‌పోచంపల్లిలోని జేవీఎస్‌ గార్డెన్‌కు రాష్ట్రపతి చేరుకోనున్నారు. సుమారు గంటపాటు రాష్ట్రపతి పర్యటన కొనసాగనుంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

>
మరిన్ని వార్తలు