అరెస్టైన ఇద్దరు పాల పాపాత్ములు!

18 Dec, 2023 12:12 IST|Sakshi
పోలీసులు అరెస్ట్‌ చేసిన వ్యాపారులు పాండు, అజ్గర్‌, స్వాధీనం చేసుకున్న కల్తీపాల క్యాన్లు

భూదాన్‌పోచంపల్లి: మండలంలోని కనుముకుల, గౌస్‌కొండ గ్రామాల్లో ఆదివారం ఎస్‌ఓటీ పోలీసులు అకిస్మిక దాడులు చేసి కల్తీపాలు తయారు చేస్తున్న పాలవ్యాపారులను అరెస్ట్‌ చేశారు. కనుముకులకు చెందిన పాల వ్యాపారులు పాండు, గౌస్‌ కొండ గ్రామానికి చెందిన అజ్గర్‌ ఇళ్లపై పోలీసులు దాడి చేశారు.

వారి వద్ద నుంచి 350 లీటర్ల కల్తీపాలు, 2.1 లీటర్ల హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌, 11 డోలోఫర్‌ స్కిమ్డ్‌ పాల ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని అరెస్ట్‌ చేసి స్థానిక పోలీసులకు అప్పగించారుచారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ విక్రమ్‌రెడ్డి తెలిపారు.

>
మరిన్ని వార్తలు