శ్రీశైలానికి ప్రత్యేక బస్సులు

20 Mar, 2023 02:06 IST|Sakshi

కర్నూలు– శ్రీశైలం చార్జీ రూ.350

కర్నూలు(రాజ్‌విహార్‌): ఉగాది పండుగ సందర్భంగా శ్రీశైల క్షేత్రానికి ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కర్ణాటక ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చే అవకాశం ఉండటంతో శ్రీశైలానికి ప్రత్యేక బస్సులు నడిపేందుకు ప్రణాళిక రూపొందించారు. కర్నూలు జిల్లాలోని 4 డిపోల నుంచి 130 ప్రత్యేక బస్సులు నడపనున్నారు. ఇందులో కర్నూలు జిల్లాకు చెందినవి 75, ఇతర జిల్లాలకు చెందిన 55 బస్సులున్నాయి. ఆదోని నుంచి శ్రీశైలానికి 35, కర్నూలు–1 డిపో నుంచి 32, ఎమ్మిగనూరు–30, కర్నూలు–2డిపో నుంచి 33, కాలినడకన శ్రీశైలం వెళ్లే భక్తుల సౌకర్యార్థం కర్నూలు– వెంకటాపురం మధ్య రద్దీ మేరకు బస్సులు నడపనున్నారు. తిరుగు ప్రయాణంలో ఇబ్బందులు పడకుండా బస్సులు నడిపేలా చర్యలు తీసుకున్నారు. డీజిల్‌ ధరలు పెంచినా భక్తులపై భారం పడకుండా గత ఏడాది చార్జీలనే వసూలు చేస్తున్నట్లు ఆర్టీసీ ఆర్‌ఎం టి. వెంకటరామం తెలిపారు. కర్నూలు నుంచి శ్రీశైలానికి రూ.350, ఆదోని నుంచి రూ.500, ఎమ్మిగనూరు నుంచి రూ.450, కోడుమూరు నుంచి రూ.400, నందికొట్కూరు నుంచి రూ.300, ఆత్మకూరు నుంచి రూ.250, మహానంది నుంచి రూ.350, కర్నూలు– వెంకటాపురానికి రూ.150 చొప్పున చార్జీ వసూలు చేయనున్నట్లు చెప్పారు.

మరిన్ని వార్తలు