మండు వేసవిలో వజ్రాన్వేషణ

20 Mar, 2023 02:06 IST|Sakshi
జొన్నగిరి వద్ద వజ్రాన్వేషణ చేస్తున్న దృశ్యం

తుగ్గలి: మామూలుగా తొలకరి వర్షాలకు వజ్రాల వేట మొదలవుతుంది. అయితే గత రెండేళ్లుగా వేసవిలోనూ వజ్రాలు వెతికేందుకు వస్తున్నారు. రెండు రోజుల నుంచి వర్షాలు కురుస్తుండటంతో కడప, ఒంగోలు తదితర ప్రాంతాలకు చెందిన పలువురు వజ్రాలు వెతికేందుకు జొన్నగిరికి వచ్చారు. ఈ ప్రాంతంలో వర్షం లేకున్నా పొలాల్లో వజ్రాలు వెతుకుతున్నారు. తొలకరి వర్షాలకు ఏటా ఈ ప్రాంతంలో వజ్రాలు లభ్యమవడం సర్వ సాధారణం. వజ్రాన్వేషకుల తాకిడి ఎక్కువై పంట పొలాలు గట్టిపడుతుండడంతో గతేడాది రైతులంతా కలిసి వజ్రాన్వేషకులు ఎవరూ రావద్దని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం గమనార్హం. గతంలో రైతులపై వజ్రాన్వేషకులు దాడులకు దిగడం కూడా చోటచేసుకుంది. విత్తనానికి ముందుకు రైతులు వజ్రాన్వేషకులను నిలువరించేందుకు నానా అవస్థలు పడాల్సి వస్తోంది.

మరిన్ని వార్తలు