నేటి నుంచి విద్యార్థులకు రాగి జావ

21 Mar, 2023 01:18 IST|Sakshi

కర్నూలు సిటీ: ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల విద్యార్థులకు నేటి (మంగళవారం) నుంచి రాగి జావ అందించనున్నారు. జిల్లాలో 1,436 పాఠశాలల్లో 2.74 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి ఉదయం 8.45 నిమిషాలకు రాగి జావ ఇవ్వాలని నిర్ణయించారు. అయితే ఆ సమయానికి వంట ఏజెన్సీలకు చెందిన వారు తయారు చేయడం సాధ్యం కాదని ఉపాధ్యాయ సంఘాల నాయకులు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే పిల్లలు సైతం ఇళ్ల దగ్గర టిఫిన్‌/భోజనం చేసి వచ్చి ఉంటారు కాబట్టి ఇష్టంగా తీసుకోలేరని చెప్పారు. దీంతో ఇంటర్వెల్‌ సమయంలో ప్రతి విద్యార్థికి వారానికి మూడు సార్లు 150 ఎంఎల్‌ రాగి జావా ఇవ్వాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమాన్ని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించనున్నారు. జిల్లా స్థాయి కార్యక్రమం బీక్యాంపులోని బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించనుండగా కలెక్టర్‌ పి. కోటేశ్వరరావు హాజరుకానున్నారు. ఇప్పటికే జిల్లాలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లకు రాగి పిండి, బెల్లం చేర్చారు.

ఇంటర్వెల్‌ సమయంలో ఇచ్చేందుకు ఏర్పాట్లు పూర్తి

ప్రతి విద్యార్థికి 150 ఎం.ఎల్‌ రాగి జావ

మరిన్ని వార్తలు