-

చిరుధాన్యాల సాగుకు తొమ్మిది ప్రత్యేక క్లస్టర్లు

22 Mar, 2023 02:30 IST|Sakshi

కర్నూలు(అగ్రికల్చర్‌): చిరుధాన్యాల పంటల సాగును ప్రోత్సహించేందుకు జిల్లా వ్యవసాయ శాఖ తొమ్మిది ప్రత్యేక క్లస్టర్లను ఏర్పాటు చేస్తోంది. మైనర్‌ మిల్లెట్స్‌లో కొర్ర, మేజర్‌ మిల్లెట్స్‌లో సజ్జ, జొన్న సాగును మరింత ప్రోత్సహించడం లక్ష్యంగా క్లస్టర్లు ఏర్పటు చేస్తుండటం విశేషం. 100 హెక్టార్లు ఒక క్లస్టరుగా గుర్తించారు. 2023వ సంవత్సరాన్ని అంతర్జాతీయ మిల్లెట్‌ ఇయర్‌గా ప్రకటించిన నేపథ్యంలో చిరుధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు, వినియోగాన్ని పెంచేందుకు ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. హెక్టారుకు ప్రభుత్వం రూ.6వేల విలువ చేసే ఇన్‌పుట్స్‌ సరఫరా చేస్తుంది.

కొర్ర క్లస్టర్‌: కోడుమూరు, వెల్దుర్తి మండలం బోగోలు.

సజ్జ క్లస్టర్‌: ఆలూరు మండలం హొలేబీడు, మద్దికెర మండలం పెరవలి, దేవనకొండ, పత్తికొండ మండలం హోసూరు, తుగ్గలి మండలం రాతన.

మరింత పకడ్బందీగా ఉపాధి పనులు

కర్నూలు(అగ్రికల్చర్‌): ఉపాధి హామీ పనుల్లో అక్రమాలకు తావు లేకుండా మరింత కట్టుదిట్టంగా చేపట్టాలని జిల్లా నీటియాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్‌ అమరనాథరెడ్డి అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని డ్వామా కార్యాలయంలో ఓర్వకల్లు, గోనెగండ్ల మండలాలకు సంబంధించి 16వ విడత సోషల్‌ ఆడిట్‌పై ఓపెన్‌ ఫోరం నిర్వహించారు. సోషల్‌ ఆడిట్‌ సబ్బంది మెటీరియల్‌, లేబర్‌ కాంపోనెంట్‌ కింద చేపట్టిన పను ల్లో గుర్తించిన అవకతవకలు, తేడాలను వివరించారు.

మరిన్ని వార్తలు