మహానందీశ్వరుడి దర్శనవేళల్లో మార్పులు

14 Nov, 2023 01:44 IST|Sakshi

● ఈఓ కాపు చంద్రశేఖర్‌రెడ్డి

మహానంది: కార్తీకమాసంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని శ్రీ మహానందీశ్వరస్వామి దర్శనం వేళల్లో మార్పులు చేపట్టినట్లు ఈఓ కాపు చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. కార్తీకమాసం ఏర్పాట్లపై సోమవారం సిబ్బందితో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈఓ మాట్లాడుతూ ప్రతి శని, ఆది, సోమవారాల్లో వేకువజామున 4 నుంచి రాత్రి 10.30 గంటల వరకు దర్శనం ఉంటుందన్నారు. మిగిలిన రోజుల్లో వేకువజామున 5 నుంచి రాత్రి 9.30 గంటల వరకు దర్శనం కొనసాగుతుందన్నారు. దీంతో పాటు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా శీఘ్రదర్శనం, అతి శీఘ్రదర్శనం, స్పర్శదర్శనం, సాధారణ దర్శనాలకు వేర్వేరు గా ఏర్పాటు చేసిన క్యూలైన్ల వద్ద బోర్డులు చేయించాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. భక్తులరద్దీని దృష్టిలో ఉంచుకుని ఎప్పటికప్పుడు సిబ్బంది పర్యవేక్షిస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆలయ సూపరింటెండెంట్‌ ఓంకారం వెంకటేశ్వరుడు, ఇన్‌స్పెక్టర్లు ముడియం చంద్రశేఖర్‌రెడ్డి, నాగభూషణంకు సూచించారు. ఈనెల 26వ తేదీన కార్తీకపౌర్ణమి సందర్భంగా ఆలయ ఆవరణలో జ్వాలాతోరణం, కోటి దీపోత్సవం కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

మరిన్ని వార్తలు