పనిదినాలు ఖరారు

23 Mar, 2023 01:08 IST|Sakshi
నర్వ మండలంలో ఉపాధి పనులు చేస్తున్న కూలీలు (ఫైల్‌)

ఉపాధి హామీ పథకం కూలీలకు

కల్పించాల్సిన పని దినాలను రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ఖరారు చేశారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది పర్యటించి

పంచాయతీల వారీగా కూలీలను గుర్తించి తీర్మానాలు చేశారు. ఎంపీడీఓలు, ఏపీఓలు సాంకేతిక కంప్యూటర్‌ సహాయకులు

సర్పంచ్‌లు అంతా ఈ ప్రక్రియలో

భాగస్వాములయ్యారు.

2023–24 వార్షిక

ఉపాధి ప్రణాళిక సిద్ధం

నర్వ: జిల్లా వ్యాప్తంగా గత ఏడాది ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు 30లక్షల 51వేల పని దినాలకు గాను 21, 58,925 పనిదినాలు పూర్తి చేశారు. అత్యధికంగా మద్దూర్‌ మండలంలో 3,51,474 పని దినాలు కల్పించారు. ఈ ఆర్థిక సంవత్సరం జిల్లాలో మొత్తం 1,10, 615 జాబ్‌కార్డులకు గాను 2,03,192 కూలీలకు పని కల్పించేందుకు సిద్ధం చేశారు. చేసిన పనులకు ఇప్పటివరకు రూ.3756.4 లక్షలు ఖర్చు చేశారు. సామగ్రికి రూ.2105.1 లక్షలు ఖర్చయ్యాయి, పనిలోకి వచ్చిన వారికి రూ.257 నిర్ణయించగా ప్రస్తుతం రూ.170 వరకు లభిస్తోంది.

ప్రణాళిక ఆధారంగానే..

2023–24 ఆర్థిక సంవత్సరం 28లక్షల 40 వేల పనిదినాలను ఖరారు చేశారు. వచ్చే ఏప్రిల్‌ నుంచి గ్రామసభలో ఖరారు చేసిన ప్రణాళిక ఆధారంగానే చర్యలు తీసుకోనున్నారు. గత ఏడాది అత్యధికంగా మద్దూర్‌ మండలంలో పని దినాలు కల్పించారు. ఉపాధి పథకం ద్వారా 90 రకాల పనులను చేపట్టనున్నారు. ప్రధానంగా రైతులకు ప్రయోజనాన్ని కల్పించే సాగు కాలువలు నిర్మించడం, పూడికతీత, ముళ్లపొదల తొలగింపు, నీటి కుంటల నిర్మాణాలు, సమగ్ర భూఅభివృద్ధి పనులు, రహదారుల నిర్మాణం, హరితహారం భూములు చదును చేయడం వంటివి చేయనున్నారు.

గ్రామం యూనిట్‌గా..

ఉపాధి హామీ పథకానికి సంబందించి చేపట్టనున్న పనుల అమలులో సమూల మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నూతన సాఫ్ట్‌వేర్‌ మార్పుతో ఇక నుంచి గ్రామం యూనిట్‌గా ఉపాధి పనులు జరగనున్నాయి. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో టీఎస్‌ రాగాస్‌ సాంకేతికత ద్వారా ఉపాధి పనులు చేపట్టేవారు. ప్రస్తుతం ఉన్న సాఫ్ట్‌వేర్‌ ఎన్‌ఐసీ (నేషనల్‌ ఇన్‌ఫెర్టిటిక్‌ సెంటర్‌) ద్వారా పనులను చేపట్టనున్నారు.

ఫొటోలతో సహా నమోదు..

ఈ ఏడాది జనవరి నుంచి ఉపాధి హామీ పథకం క్షేత్రస్థాయిలో పనిచేసే ఉద్యోగులు పనుల వద్దకు వెళ్లి కూలీల హాజరును ఫొటోలతో నమోదు చేసి ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేయాల్సి ఉంది. ఉదయం, మధ్యాహ్నం కూలీల హాజరును క్షేత్రస్థాయిలో పరిశీలించి ఫొటోలతో సహా ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. దీంతో నిజంగా పనులు చేసిన కూలీల వివరాలే నమోదై వారికి వేతనం అందుతుంది. ఆర్థికపరమైన అవకతవకలను కూడా నివారించవచ్చని అధికారులు భావిస్తున్నారు.

మండలం కూలీల సంఖ్య పని దినాలు

నారాయణపేట 12,465 3,37,793

మద్దూర్‌ 13,310 3,51,474

మక్తల్‌ 12,439 2,70,300

ఊట్కూర్‌ 11,431 2,65,467

దామరగిద్ద 7,675 1,47,818

ధన్వాడ 5,822 1,89,924

కోస్గి 7,243 1,62,646

మాగనూర్‌ 4,440 93,426

మరికల్‌ 5,342 1,40,081

నర్వ 5,879 1,41,167

క్రిష్ణ 2,400 58,829

ఏడాదిలో 28.90లక్షల

పని దినాలు

పని అడిగిన ప్రతి కూలీకి ఉపాధి

గ్రామం యూనిట్‌గా ఫొటోలతో హాజరు నమోదు

కూలీలందరికీ పని కల్పిస్తాం..

జాబ్‌కార్డు కలిగి, పని కావాలని అడిగిన వారందరికీ పని కల్పిస్తాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పనుల పూర్తికి చర్యలు చేపట్టాం. 2023–24 ఆర్థిక సంవత్సరంలో చేపట్టే పని దినాలు ఖరారయ్యాయి. ప్రణాళిక ప్రకారం గ్రామాల్లో పనులు చేపట్టేలా చర్యలు తీసుకుంటాం.

– గోపాల్‌నాయక్‌, డీఆర్‌డీఓ

మరిన్ని వార్తలు