-

ఇంటింటా తెలుగు సంవత్సరాది వేడుకలు

23 Mar, 2023 01:08 IST|Sakshi
జిల్లా కేంద్రంలోని సింగార్‌బేస్‌ శివలింగేశ్వర మఠంలో పంచాంగ శ్రవణం

నారాయణపేట టౌన్‌: జిల్లాలో శోభకృత్‌ నామ తెలుగు నూతన సంవత్సర వేడుకలను బుధవారం ప్రజలు ఘనంగా నిర్వహించారు. ఇళ్లకు మామిడి తోరణాలు, పూలు కట్టి అలంకరించారు. షడ్రుచులతో తయారు చేసిన పచ్చడిని, పండిపదార్థలతో చేసిన భక్షాలు, పలు రకాల వంటలు తయారు చేసుకుని ఆరగించారు. బంధుమిత్రులు ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. ఈ నూతన సంవత్సరంలో అన్నివిధాలా కలిసిరావాలని అన్నదాతలు ఇష్టదైవానికి నైవేద్యం సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు. కొందరు రైతులు పొలాలకు వెళ్లి పూజలు చేసి, వ్యవసాయ పనులు ప్రారంభించారు. సాయంత్రం ఆలయాల వద్ద పూజారులు పంచాంగ శ్రవణం చేశారు.

శక్తిపీఠంలో పంచాంగ శ్రవణం

శుభా శుభ మిశ్రమ ఫలితంగా శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం గడుస్తుందని శక్తి పీఠం వ్యస్థాపకులు స్వామిజీ శాంతానంద పురోహిత్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని సంత్‌మఠ మూల మహా సంస్థానం శక్తి పీఠంలో బుధవారం పంచాంగ శ్రవణం చేశారు. రాశి ఫలితాలలో ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం ఇలా 12 రాశుల ఫలితాలను క్లుప్తంగా వివరించారు. నక్షత్రాలు, గ్రహస్థితులు, గోచారస్థితి, గ్రహబలం, ఏడాదిలో వచ్చే పండుగలు, వర్షాలు, గ్రహణాలు, పంటలు, ధరలు రాజకీయ పరిణామాలపై వివరించారు. అనంతరం శక్తి పీఠం పురస్కార గ్రహీతలు రాఘవేంద్ర స్వామి దేవాలయ ప్రధాన అర్చకులు కొల్పురు నరసింహాచార్య, ప్రముఖ కవి రచయిత రామ్మోహన్‌రావు, తాటి నర్సప్ప, సామాజిక సేవకులు సుజేంద్రశెట్టి, శిశు మందిరం ప్రధాచార్యులు దత్తు చౌదరికి ఉగాది పురస్కారం అందించి ఘనంగా సన్మాంచారు. కార్యక్రమంలో శక్తి పీఠం మార్గదర్శకులు ఊట్కూర్‌ యజ్ఞనారాయణ పురోహిత్‌, శక్తి పీఠం సభ్యులు మురళీధర్‌, నారాయణరెడ్డి, దోమ సుధాకర్‌, డా.మదన్‌మోహన్‌రెడ్డి, ఇందిర, వరలక్ష్మి, దోమ వాణి, పట్టణ పుర ప్రముఖులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అలాగే సరస్వతీ శిశు మందిరం ఉన్నత పాఠశాలలో, సింగార్‌బేస్‌ శివలింగేశ్వర స్వామి మఠంలో వేదపండితులు పంచాంగ శ్రవణం వినిపించారు. పాఠశాల అధ్యక్షుడు రతంగ్‌పాండురెడ్డి, ఉపాధ్యక్షుడు రాఘవేంద్రరెడ్డి, ఆచార్యలు, మాతాజీలు, విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో శక్తి పీఠం వివిధ ప్రముఖ్‌లు భక్తులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.

ఆలయాల్లో ప్రత్యేక పూజలు

సాయంత్రం పంచాగ శ్రవణం

విన్న ప్రజలు

మరిన్ని వార్తలు