దేశ సంస్కృతికి స్ఫూర్తి కవులు, గాయకులు

23 Mar, 2023 01:08 IST|Sakshi

నారాయణపేట టౌన్‌: దేశ సంస్కృతి సాంప్రదాయాలకు కవులు, గాయకులు స్ఫూర్తి ప్రదాతలని మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ హరినారాయణ్‌ భట్టడ్‌, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు గందె చంద్రకాంత్‌ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం కళాకారులకు పెద్దపీట వేసి దేశం గర్వించే విధంగా ఆదరిస్తున్నదని, సమాజ శ్రేయస్సుకు నిస్వార్థంగా కవితలు, పాటల రూపంలో ప్రేరణ కవులు, కళాకారులేనని పేర్కొన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉగాది పండుగ సందర్భంగా బీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షులు విజయ్‌సాగర్‌ నేతృత్వంలో ప్రముఖ కవి, గాయకులు జ్ఞానేశ్వర్‌ గౌడ్‌, సంగ నర్సిములను పూలమాల, శాలువా, తాంబూల నారికేళ ఫలంతో ఘనంగా సత్కరించారు. ఉగాది పురస్కారం అందించారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ కార్యదర్శి చెన్నారెడ్డి, నాయకులు సుదర్శన్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, సుభాష్‌, కన్నజగదీష్‌, సతీష్‌, బోయలక్ష్మణ్‌, గురు లింగప్ప, వినోద్‌, నారాయణ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా బీరప్ప

బండారోత్సవం

నారాయణపేట టౌన్‌: మండలంలోని సింగారం గ్రామంలో ఐదు రోజులుగా కొనసాగుతున్న బీరప్ప బండారు ఉత్సవాలు బుధవారం ఘనంగా ముగిశాయి. ఐదేళ్లకు ఒక్కసారి నిర్వహించే ఈ ఉత్సవాలలో చివరిరోజు యానగుంది బీరప్ప ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయం నుంచి పెద్ద బోనంకుండతో గ్రామంలో ఊరేగింపుతో ఎల్లమ్మ ఆలయం చేరుకున్నారు. గ్రామస్తులు తమ బంధువులకు కొత్త బట్టలతో ఒడి బియ్యం పోసి బండారు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

మరిన్ని వార్తలు