‘సాక్షి’లో రాశాకే న్యాయం జరిగింది

24 Mar, 2023 05:50 IST|Sakshi

కోస్గి: మా సొంత పొలంలో మామిడి, బత్తాయి తోటలు పెట్టి డ్రిప్‌ కోసం దరఖాస్తు చేసుకున్నాము. సంవత్సరం దాటినా డీలర్లు ఎలాంటి సామగ్రి ఇవ్వలేదు. జిల్లా కార్యాలయం నుంచి తెచ్చిన జాబితాలో మా పేరున డ్రిప్‌ తీసుకున్నట్లు ఉండటంతో సాక్షిని ఆశ్రయించాము. సమగ్ర విచారణ చేసి అన్ని ఆధారాలతో ‘సూక్ష్మ సేద్యం.. కుంభకోణం’ అంటూ కథనం రావడంతో అధికారులు మా దగ్గరకు వచ్చారు. పేపర్‌లో రాగానే డీలర్లు మాకు ఇవ్వాల్సిన సామగ్రిని ఇచ్చి తోటలో బిగించారు. డీలర్ల చుట్టు తిరిగినా, అధికారుల చుట్టు తిరిగినా ఫలితం లేకుండా పోయింది. సాక్షి పేపర్‌లో రాసిన తర్వాతనే మాకు న్యాయం జరిగింది. – పాశం బాల్‌రాజ్‌, రైతు

మరిన్ని వార్తలు