వేసవి భత్యంలో కోత

25 Mar, 2023 01:28 IST|Sakshi

కేంద్ర ప్రభుత్వం నూతన సాఫ్ట్‌వేర్‌ ఎన్‌ఎంఎంఎస్‌లో వేసవి భత్యం ఆప్షన్‌ లేకపోవడంతో కూలీలకు ఫిబ్రవరిలో కూలీకి అదనంగా 20 శాతం, మార్చిలో 25, ఏప్రిల్‌, మేలో 30, జూన్‌లో 30 శాతం అదనంగా వేసవి భత్యం పేరుతో పేమెంట్‌ ఇచ్చేవారు. నూతన సాఫ్ట్‌వేర్‌ విధానంలో వేసవి భత్యం తీసేయడంతో పాటు రెండు పూటలా పని విధానం, ఆన్‌లైన్‌ హాజరు నమోదులో తరుచూ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. సాంకేతిక కారణాలతో జాబ్‌కార్డు ఆధార్‌ అనుసంధానం కాకపోవడం లాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. దీంతోపాటు పని ప్రదేశంలో కనీస వసతులు కల్పించకపోవడంతో కూలీలు ఉపాధి పనులకు వెళ్లడానికి వెనకడుగు వేస్తున్నారు. జిల్లాలో పనిచేసే కూలీలు 88,446 మంది ఉండగా ఈ వారంలో పనిచేసినా కూలీలు సంఖ్య 14,452 మాత్రమే. 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పనిదినాల లక్ష్యం 30,51,097 కాగా ఇప్పటి వరకు 21,41,798 పనిదినాలు మాత్రమే పూర్తయ్యాయి. 70.2 శాతం మాత్రమే పని దినాల లక్ష్యం చేరుకున్నారు. ఇంకా వారం రోజుల మాత్రమే ఉపాధి సంవత్సరం మిగిలి ఉండడంతో లక్ష్యం నేరవేరే పరిస్థితి కనిపించడం లేదు.

మరిన్ని వార్తలు