రైతులకు అండగా..

26 Mar, 2023 01:38 IST|Sakshi

తాము చదువుకుంటున్న ఏజీబీఎస్సీ డిగ్రీ పూర్తి కాగానే రైతులకు అందుబాటులో ఉండి వారు చేస్తున్న వ్యవసాయంలో మెళకువలు నేర్పిస్తూ అండగా ఉంటామని పాలెం వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ 4వ సంవత్సరం విద్యార్థిని ఉషశ్రీ పేర్కొన్నారు. ఈమె సొంతూరు గద్వాల కాగా.. తండ్రి తిరుమలేశ్‌ పోలీస్‌ కానిస్టేబుల్‌, తల్లి లక్ష్మి గృహిణి. తాను వ్యవసాయంపై మక్కువతోనే బీఎస్సీలో చేరినట్లు చెప్పారు. బొందలపల్లి రావేప్‌ క్యాంపులో భాగంగా రైతులకు వ్యవసాయంలో మెళకువలు నేర్పుతూ మిర్చిపంటను ఆశిస్తున్న తెగుళ్ల నివారణకు సూచనలు చేస్తున్నారు. రసం పీల్చే పురుగు నివారణకు రైతులు తగు మోతాదులో రసాయనిక మందులను పిచికారీ చేసుకోవాలని సూచిస్తున్నారు.

మరిన్ని వార్తలు