ఎంపీపీ చొరవతో వైస్‌చైర్మన్‌గా లక్ష్మీకాంత్‌..

26 Mar, 2023 01:38 IST|Sakshi

నారాయణపేట మార్కెట్‌ చైర్మన్‌ పదవి ఎస్సీ జనరల్‌కు రిజర్వు కావడంతో వైస్‌ చైర్మన్‌ పదవిపై పలువురు ఆశలు పెట్టుకున్నారు. అయితే ఎంపీటీసీ ఎన్నికల్లో నారాయణపేట మండలంలోని చిన్న జట్రంకు చెందిన లక్ష్మీకాంత్‌ ఎంపీటీసీకి పోటీ చేస్తానని అప్పట్లో ఎమ్మెల్యే ఎస్‌.రాజేందర్‌రెడ్డిని కోరారు. అయితే ఎంపీపీ స్థానం జనరల్‌కు రిజర్వు కావడంతో అప్పక్‌పల్లికి చెందిన అమ్మకోళ్ల శ్రీనివాస్‌రెడ్డి చిన్నజట్రం నుంచి ఎంపీటీసీకి పోటీ చేయించారు. ఆయనను గెలిపించి ఎమ్మెల్యే మాటను నిలబెట్టారు. టీడీపీలో ఉన్నప్పటి నుంచి చిన్నజట్రం లక్ష్మీకాంత్‌ ఎమ్మెల్యే వెంబడే నమ్మిన బంటుగా ఉండడంలో తనదైన శైలిలో మార్కు నిలబెట్టుకున్నారు. ఆ ఎన్నికల్లో అమ్మకోళ్ల శ్రీనివాస్‌రెడ్డి గెలుపుకు కృషి చేసిన లక్ష్మీకాంత్‌ భవిష్యత్‌లో అవకాశం వచ్చినప్పుడు అందలం ఎక్కిస్తామని అప్పట్లో ఎంపీపీ సైతం మాటఇచ్చారు. దీంతో ఎంపీపీ చొరవ తీసుకొని ఎమ్మెల్యేకు లక్ష్మీకాంత్‌ పేరును సిఫారసు చేయడం.. ఎమ్మెల్యేకు నమ్మినబంటు కావడంతో ఆయనకు వైస్‌ చైర్మన్‌ పదవి దక్కడంతో ఆనందంలో మునిగిపోయారు.

మరిన్ని వార్తలు