రైతులు వ్యవసాయాన్ని.....

26 Mar, 2023 01:38 IST|Sakshi

రైతులు వ్యవసాయాన్ని కష్టంగా కాకుండా ఇష్టంతో చేస్తేనే అధిక దిగుబడులు సాధించవచ్చని పాలెం వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ నాలుగో సంవత్సరం విద్యార్థిని ప్రియాంక పేర్కొన్నారు. ఈమె ది ప్రకాశం జిల్లాలోని మార్కాపురం కాగా.. తండ్రి కాటంరాజు మాజీ సైనిక ఉద్యోగి, తల్లి నారాయణమ్మ గృహిణి. 50 రోజులుగా మండలంలోని బొందలపల్లిలో రైతులు చేస్తున్న వ్యవసాయ క్షేత్రాలను పరిశీలిస్తూ పంటలను ఆశిస్తున్న తెగుళ్ల నివారణకు సూచనలు, సలహాలు అందిస్తున్నారు. రైతులు ఎప్పుడూ వ్యవసాయాన్ని ఇష్టంతోనే చేయాలని అప్పుడే అధిక దిగుబడులు సాధించడానికి వీలవుతుందని చెబుతున్నారు. ప్రస్తుతం పెరుగుతున్న సాంకేతికతను ఒకవైపు అనుసరిస్తూనే.. రసాయనిక ఎరువులకు బదులు పాత పద్ధతిలోని సేంద్రియ ఎరువులను వాడి అధిక దిగుబడులు సాధించవచ్చని సూచిస్తున్నారు.

మరిన్ని వార్తలు