ప్రజాసంక్షేమమే కేసీఆర్‌ లక్ష్యం

26 Mar, 2023 01:38 IST|Sakshi
మాట్లాడుతున్న ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి

మక్తల్‌: ప్రజా సంక్షేమమే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా ఇన్‌చార్జ్‌ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, జెడ్పీ చైర్మన్‌ వనజ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ప్రవేశపెట్టిన పథకాలు దేశంలోనే ఎక్కడాలేవని అన్నారు. భారతదేశంలో నంబర్‌వన్‌ సీఎంగా పేరు తెచ్చుకున్న ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ వంటి పథకాలను అన్నివర్గాలకు అందిస్తున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు. తన పరిధిలో ఎవరికి ఏ ఆపద వచ్చినా ఆదుకుంటానని అన్నారు. మక్తల్‌ నియోజకవర్గంలో అందరూ బాగుండాలన్నాదే తన లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ట్రేడ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దేవరి మల్లప్ప, జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యురాలు చిట్టెం సుచరితరెడ్డి, ఎంపీపీ వనజ, మాజీ ఎంపీపీ గడ్డంపల్లి హన్మంతు, మాజీ మార్కెట్‌ చైర్మన్‌ నర్సింహగౌడ్‌, రాజేష్‌గౌడ్‌, మాజీ ఎంపీపీ చంద్రకాంత్‌గౌడ్‌, సీనియర్‌ నాయకుడు శ్రీనివాస్‌గుప్తా, పార్టీ మండల అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, శేకర్‌రెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు