సూపర్‌హీరో మరో ఔదార్యం, నెటిజన్లు ఫిదా 

22 Apr, 2021 13:49 IST|Sakshi

సూపర్‌హీరో మరో ఔదార్యం

తన బహుమతిలో సగం బాలుడికి  డొనేట్‌

హ్యట్యాఫ్‌ మయూర్ షెల్కే  అంటున్న నెటిజన్లు

సాక్షి, ముంబై:   ప్రాణాలకు  తెగించి మరీ పట్టాలపై పడి పోయిన  బాలుడిన కాపడిన రైల్వే పాయింట్‌మ్యాన్  మయూర్‌ షెల్కే  తన  ఔదార్యంతో మరోసారి రియల్‌ హీరోగా నిలిచారు. తనకు బహుమతిగా వచ్చిన డబ్బులో సగం భాగాన్ని తాను రక్షించిన బాలుడికి ఇచ్చేందుకు నిర్ణయించుకున్నారు. అతని కుటుంబం ఇబ్బందుల్లో ఉందని తెలుసుకున్న తరువాత మయూర్‌  ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని  భావించారు.  ఆ బాలుడి చదువు, సంక్షేమం  నిమిత్తం  కొంత సొమ్మును దానం చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో అతని పెద్దమనసుకు నెటిజనులు  హ్యాట్యాఫ్‌ అంటున్నారు.  మా మనసులను ఎన్నిసార్లు గెల్చుకుంటావ్‌ భయ్యా అంటూ  షెల్కేకు  ఫిదా అవుతున్నారు.  (సూపర్ హీరోలకే హీరో: ప్రశంసలు, బంపర్ గిఫ్ట్‌)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు