ఒక్కరి ద్వారా 406 మందికి కరోనా వైర‌స్

26 Apr, 2021 20:41 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తున్న తరుణంలో ప్రజలు క‌రోనా నిబంధ‌న‌లు, భౌతిక దూరం వంటివి పాటించపోతే కేవలం 30 రోజుల వ్యవధిలో 406 మందికి కరోనా వైరస్ సోకే అవకాశం పరిశోధనలో తేలినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. అదే భౌతిక దూరం, కోవిడ్ నిబందనలు 50 శాతం మేర పాటిస్తే 406కు బదులుగా 15 మందికి మాత్రమే సోకుతుందని, ఇక 75 శాతం మేర పాటిస్తే ముగ్గురికి మాత్రమే సోకుతుందని కేంద్రం పేర్కొంది.

ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని అర్ధం చేసుకోని కరోనా నియంత్రణకు తమకు సహకరించాలని కేంద్రం కోరింది. క‌రోనా నియంత్ర‌ణ‌కు భౌతిక దూర‌మే ముఖ్య‌మ‌ని, మాస్కులు, శానిటైజ‌ర్లు వైర‌స్‌ వ్యాప్తి తీవ్రతను మాత్ర‌మే త‌గ్గిస్తాయ‌ని డాక్ట‌ర్ వీకే పాల్ పేర్కొన్నారు. ద‌య‌చేసి అత్యవసర విషయానికి తప్ప బ‌య‌టకు వెళ్ల‌వ‌ద్ద‌ని, ఇత‌రుల‌ను ఇండ్ల‌కు ఆహ్వానించ‌వ‌ద్ద‌ని ఆయ‌న పాల్ సూచించారు. ఆసుపత్రి పడకల విషయంలో భయాందోళనలకు గురికావొద్దని అధికారులు హెచ్చరించారు. ప్రజలు వైద్యులు సిఫారసు చేసినప్పుడు మాత్రమే ఆసుపత్రిలో చేరాలని కోరారు. "సాధ్యమైనంత మేర కేసుల సంఖ్యను తగ్గించి, ఆసుపత్రి వనరులను తగిన విదంగా ఉపయోగించడానికి ప్రయత్నిస్తున్నాము. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆక్సిజన్‌ను తగిన విదంగా ఉపయోగించడం చాలా ముఖ్యం"అని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా చెప్పారు.

చదవండి: 

ఇంట్లో ఉన్నా మాస్క్‌ ధరించాల్సిందే

మరిన్ని వార్తలు