దేశ్‌ముఖ్, పరబ్‌లకు 40 కోట్లు ఇచ్చారు

18 Sep, 2021 06:29 IST|Sakshi

ముంబై: బదిలీ ఉత్తర్వులను నిలిపివేసేందుకు మహారాష్ట్ర రవాణా మంత్రి అనిల్‌ పరబ్, మాజీ హోం మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌కు 10 మంది డీసీపీలు కలసి రూ. 40 కోట్ల రూపాయలు ముట్టజెప్పారని మాజీ పోలీసు అధికారి సచిన్‌ వాజే ఆరోపించారు. ముంబై పోలీసు కమిషనర్‌గా ఉన్న పరమ్‌ బీర్‌ సింగ్‌ జారీ చేసిన బదిలీ ఉత్తర్వుల్ని వెనక్కి తీసుకోవడానికి ఈ సొమ్ములు ముట్టజెప్పినట్టుగా వాజే ఈడీతో చెప్పారు. దేశ్‌ముఖ్‌ మాజీ వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్‌ పలాండే, వ్యక్తిగత సహాయకుడు కుందన్‌లపై నమోదైన కేసుకి సంబంధించి ఈడీ దాఖలు చేసిన చార్జ్‌ షీటులో వాజే చేసిన ఆరోపణల్ని ప్రస్తావించారు. జులై 2020లో ముంబైలో 10 మంది డీసీపీలను బదిలీ చేస్తూ పరమ్‌ బీర్‌ సింగ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీ ఉత్తర్వులపై అప్పటి హోంమంత్రి దేశ్‌ముఖ్, రవాణా మంత్రి పరబ్‌ తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని వాజే పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు