ఆరు రోజుల్లో దాదాపు పది లక్షల మందికి టీకాలు

21 Jan, 2021 20:32 IST|Sakshi

ఢిల్లీ: కోవిడ్‌ మహమ్మారిపై పోరాటంలో భాగంగా దేశవ్యాప్తంగా గత ఆరు రోజులుగా సాగుతున్న వ్యాక్సిన్‌ పంపిణీ కార్యక్రమంలో 9,99,065 మందికి వ్యాక్సినేషన్‌ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు మొత్తం 18,159 సెషన్స్‌లో టీకాల పంపిణీ చేపట్టినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొన్నారు. దేశంలోని 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇవాళ కూడా వ్యాక్సినేషన్ కొనసాగింది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. ఆంధ్రప్రదేశ్‌లో 15,507 మందికి, తెలంగాణలో 26,441 మందికి వ్యాక్సిన్‌ను అందజేశారు. 

మరిన్ని వార్తలు