పది లక్షల మంది భారతీయులు వెనక్కి! 

12 Aug, 2020 08:45 IST|Sakshi

న్యూఢిల్లీ : వివిధ దేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు ఉద్దేశించిన వందేభారత్‌ మిషన్‌లో భాగంగా దాదాపు 10 లక్షల మందిని భారత్‌కు తిరిగితెచ్చినట్లు విదేశీ వ్యవహారాల శాఖ ప్రకటించింది. కరోనా సంక్షోభ నేపథ్యంలో ప్రవాస భారతీయుల కోసం ఈ మిషన్‌ను మే 7న ఆరంభించారు.  ఇదే సమయంలో భారత్‌ నుంచి దాదాపు 1.3 లక్షల మంది వివిధ దేశాలకు విమానాల ద్వారా వెనక్కు వెళ్లారని పౌరవిమానయాన శాఖ తెలిపింది. ప్రస్తుతం వందేభారత్‌ మిషన్‌లో 5వ దశ నడుస్తోంది. ఇందులో దాదాపు 1.3 లక్షల భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు.
(చదవండి : మానవాళికి మంచిరోజులు! )

మరిన్ని వార్తలు