క్యాన్సర్‌ రోగుల కోసం జుట్టు దానం చేసిన చిన్నారి

21 Sep, 2020 14:33 IST|Sakshi

గాంధీనగర్‌: మనిషికి కొత్త అందాన్నిచ్చే జుట్టు గురించి ఎంత చెప్పినా తక్కువే.. మగువ అందంలో ఎనలేని పాత్ర పోషించే జుట్టును క్యాన్సర్‌ రోగుల కోసం దానం చేసి తమ ఔదార్యం చూపి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది సూరత్‌కు చెందిన ఓ చిన్నారి. వివరాలు.. దేవ్నా జనార్దన్‌ అనే పదేళ్ల చిన్నారి చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా పని చేస్తుంది. ఈ క్రమంలో క్యాన్సర్‌ రోగులకోసం తన జుట్టును దానం చేసింది. దీని గురించి దేవ్నా మాట్లాడుతూ.. ‘నా జుట్టు దానం చేస్తే ఎవరైనా ఆనందం పొందుతారంటే.. వారి కోసం సంతోషంగా నా జుట్టు ఇచ్చేయాలనుకున్నాను’ అంటుంది ఈ చిన్నారి. తన 32 అంగుళాల పొడవాటి జుట్టును దానం చేసింది. భవిష్యత్తులో క్యాన్సర్ స్పెషలిస్ట్ కావాలని దేవ్నా కోరుకుంటుంది. పదేళ్ల ఈ చిన్నారి చూపిన ఔదార్యం ప్రస్తుతం తెగ వైరలవుతోంది. చిన్నదానివైనా.. మనసు మాత్రం గొప్పది అంటూ ప్రశంసిస్తున్నారు నెటిజనులు. (చదవండి: క్యాన్సర్‌ పిల్లలకు తల్లిగా...)

మరిన్ని వార్తలు