భారత్‌పై ప్రపంచ దేశాల ప్రశంసలు.. చైనా తర్వాత ఆ ఘనత సాధించింది మనమే!

22 Oct, 2021 15:32 IST|Sakshi
100 Crore Vaccination in India

న్యూఢిల్లీ: కరోనా కొమ్ములు వంచడానికి చేస్తున్న పోరాటంలో మన దేశం మరో మైలురాయిని అధిగమించింది. తొమ్మిది నెలల్లోనే వంద కోట్ల కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ డోసుల్ని పంపిణీ చేసి ఘన కీర్తి సాధించింది. కరోనాపై పోరాటంలో రక్షణ కవచమైన భారీ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ఈ ఏడాది జనవరి 16న కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది.

తొలుత ఆరోగ్య, వైద్య సిబ్బందికి టీకా డోసులు ఇచ్చిన కేంద్రంలోని మోదీ ప్రభుత్వం విడతల వారీగా, పక్కా ప్రణాళికతో ఒక్కో వయసు వారికి ఇస్తూ ముందుకు వెళ్లింది. అక్టోబర్‌ 21 నాటికి వంద టీకా డోసుల్ని పూర్తి చేసి చైనా తర్వాత శతకోటి డోసుల్ని పంపిణీ చేసిన రెండో దేశంగా ప్రపంచ దేశాల ప్రశంసల్ని అందుకుంది. ఈ అపురూపమైన ఘట్టానికి గుర్తుగా దేశమంతటా మువ్వన్నెల వెలుగులు ప్రసరించాయి. 
(చదవండి: Viral Video: ‘ఏడవకురా.. ఏప్రిల్‌లో వెళ్లిపోతాం లే’)












వంద కోట్ల మార్క్‌ని దాటిన సందర్భాన్ని పురస్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని రామ్‌ మనోహర్‌ లోహియా ఆస్పత్రిలో వ్యాక్సినేషన్‌ కేంద్రాన్ని  సందర్శించారు. వైద్య, ఆరోగ్య సిబ్బందితో ప్రధాని మాట్లాడి వారిని అభినందించారు. లబ్ధిదారులతో కలిసి ముచ్చటించారు. ప్రధాని వెంట కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ఉన్నారు.

అంతకు ముందు ట్విట్టర్‌ వేదికగా ప్రధాని స్పందించారు. వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో భారత్‌ చరిత్ర సృష్టించిందని వ్యాఖ్యానించారు. ‘‘భారత్‌ చరిత్ర లిఖించింది. భారత శాస్త్ర, పారిశ్రామిక రంగాలతో పాటు 130 కోట్ల మంది భారతీయుల సమష్టి స్ఫూర్తికి ఈ విజయం నిదర్శనంగా నిలుస్తోంది. ఈ మహోన్నత యజ్ఞంలో పాలుపంచుకున్న మన వైద్యులు, నర్సులు ఇతర సిబ్బందికి పేరు పేరునా కృతజ్ఞతలు.
(చదవండి: VK Sasikala: శశికళ చట్టానికి చిక్కేనా?)

మరిన్ని వార్తలు