కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ : జనవరి నాటికి పదికోట్లు

23 Nov, 2020 20:50 IST|Sakshi

కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ : జనవరి నాటికి పదికోట్లు 

ప్రయోగాల్లో ప్రపంచ వ్యాప్తంగా  ప్రోత్సాహకర ఫలితాలు

ఫిబ్రవరి చివరికి కోట్లాది డోసులు

సాక్షి, న్యూఢిల్లీ: ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా, ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ సాయంతో  తీసుకొస్తున్న కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌పై సీరం సీఈవో మరోసారి కీలక విషయాన్ని ప్రకటించారు. జనవరి నాటికి కనీసం 100 మిలియన్ల మోతాదుల వ్యాక్సిన్‌ను అందుబాటులోఉంచుతామని తెలిపారు. అలాగే  ఫిబ్రవరి చివరి నాటికి వందల మిలియన్లు సిద్ధంగా ఉంటాయని అంచనావేశారు. బ్రిటన్,  బ్రెజిల్‌ ట్రయిల్స్‌లో  అస్ట్రాజెనెకా టీకా 90 శాతం ప్రభావవంతంగా ఉందని,  ప్రపంచవ్యాప్తంగా పరీక్షిస్తున్నవాటిలో  ప్రోత్సాహకరంగా ఉన్న వాటిల్లో తమది కూడా  ఉందని  అదర​  పూనవాలలా చెప్పారు. (ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ ‌: అద్భుతమైన వార్త!)

కోవిడ్‌-19  వ్యాక్సిన్‌  ‘కోవిషీల్డ్‌ ’ భారీ తయారీకి ప్రభుత్వంతో ఒప్పందాన్ని కుదుర్చుకున్న పుణే సంస్థ సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదార్ పూనావాలా సోమవారం సాయంత్రం చెప్పారు.   ఇప్పటికే 40 మిలియన్ల మోతాదులను సిద్ధం చేశామన్నారు.  రెండు డోసుల ఈ వ్యాక్సిన్‌ ఒక్కొక్క మోతాదు ధర  500-600 రూపాయల మధ్య ఉంటుందని తెలిపారు.

మరిన్ని వార్తలు