కరోనాను జయించిన వందేళ్ల బామ్మ

17 May, 2021 14:43 IST|Sakshi

హైదరాబాద్: కరోనాను జయించిన ఈ బామ్మ పేరు ఆండాళ్లమ్మ. సరూర్‌నగర్‌లోని వికాస్‌నగర్‌లో నివసిస్తున్న ఈమె శత వసంతాలు పూర్తి చేసుకుంది. కొద్దిగా వినికిడి సమస్య మినహా బీపీ, షుగర్‌ వంటి అనారోగ్య ఇబ్బందులు లేకపోవటం గమనార్హం. మహారాష్ట్రలో ఉండే మనుమరాలు, ఆమె భర్తకు కరోనా సోకటంతో హైదరాబాద్‌ తీసుకొచ్చి వైద్యం చేయించారు.

ఈ క్రమంలో ఇటీవల ఆండాళ్లమ్మ కోవిడ్‌ బారినపడ్డారు. అయితే కరోనా వచ్చిందని తెలిసినా ఆమె ఏమాత్రం భయపడలేదు. మనోనిబ్బరంతో డాక్టర్లు సూచించిన విధంగా మందులు వాడి కరోనాను జయించింది. ఆమె ధైర్యంగా ఉండటమే కాక, కుటుంబ సభ్యులకు మానసిక స్థైర్యాన్ని ఇచ్చింది. ఇలా వందేళ్ల వయసులోనూ కరో నాను జయించిన బామ్మను చూసి చుట్టుపక్కల వారు అభినందిస్తున్నారు. ఆమెను ఆదర్శంగా తీసుకోవాలంటున్నారు.

చదవండి:

కోవిడ్-19 రోగుల‌కు ఆక్సీమీట‌ర్లు ఎందుకు అవసరం?

మరిన్ని వార్తలు