దేశంలో లక్షకు దిగొచ్చిన కరోనా కేసులు

7 Jun, 2021 10:04 IST|Sakshi

న్యూఢిల్లీ:  దేశంలో కరోనా కేసులు రోజురోజుకి తగ్గుముఖం పడుతున్నాయి. సుమారు రెండు నెలల తరువాత కోవిడ్‌ కేసులు లక్షకు దిగొచ్చాయి. గత 24గంటల్లో భారత్‌లో 1,00,636  కొత్త కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 2,427 మంది కోవిడ్‌తో మృతి చెందారు.

ఇప్పటి వరకు దేశంలో 2,89,09,975 మంది కరోనా వైరస్‌ పాజిటివ్‌ తేలగా.. 3,49,186 మంది కోవిడ్‌ బాధితులు తమ ప్రాణాలను కోల్పోయారు. ఇక గత 24 గంటల్లో  1,74,399 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 14,01,609 కరోనా పాజిటివ్‌ బాధితులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇక ఇప్పటి వరకు 23.27 కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
 

(చదవండి: పాకిస్తాన్‌లో ఘోర రైలు ప్రమాదం.. 30 మంది మృతి)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు