ఢిల్లీలో త‌గ్గుముఖం ప‌ట్టిన క‌రోనా కేసులు

29 Jul, 2020 19:12 IST|Sakshi

ఢిల్లీ : దేశ రాజ‌ధాని ఢిల్లీలో క‌రోనా కేసుల సంఖ్య క్ర‌మేపీ త‌గ్గుతూ వ‌స్తుంది. గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 1035 కేసులు న‌మోదైన‌ట్లు ఢిల్లీ ప్ర‌భుత్వం బుధ‌వారం సాయంత్రం హెల్త్ బులెటిన్ విడుద‌ల చేసింది. ఈ కేసుల‌తో ఇప్ప‌టివ‌ర‌కు ఢిల్లీలో  1,33,310 క‌రోనా కేసులు న‌మోదయ్యాయి. కాగా క‌రోనాతో కొత్త‌గా 263 మంది మృతి చెంద‌డంతో మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 3,907కు చేరింది. గ‌డిచిన 24 గంట‌ల్లో క‌రోనా నుంచి 1126 మంది పూర్తిగా కోలుకొని డిశ్చార్జి కాగా.. ఇప్పటివ‌ర‌కు డిశ్చార్జి అయిన వారి సంఖ్య 1,18,633గా ఉంది.  ప్ర‌స్తుతం ఢిల్లీలో 10,770 యాక్టివ్ కేసులు ఉన్న‌ట్లు ప్ర‌భుత్వం పేర్కొంది. దేశ రాజధానిలో రికవరీ రేటు 88 శాతంగా ఉంది. (ఇద్దరు మంత్రులకు కరోనా..)

ఢిల్లీలో బుధ‌వారం నిర్వహించిన కరోనా ఆర్‌టీపీసీఆర్‌ టెస్ట్ ల సంఖ్య 5,074.
ర్యాపిడ్ టెస్ట్ల సంఖ్య 12,318
దేశరాజధానిలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా టెస్ట్ ల సంఖ్య 9,94,219
హోం ఐసోలేషన్ లో ఉన్న కేసుల సంఖ్య 5,894
కంటైన్మెంట్ జోన్ల సంఖ్య 704
ప్రభుత్వ / ప్రైవేట్ ఆసుప‌త్రుల్లో అందుబాటులో ఉన్న బెడ్ల సంఖ్య 16,008
ప్రతి  మిలియన్ జనాభాలో కరోనా టెస్ట్ ల సంఖ్య 52,327

మరిన్ని వార్తలు