సెల్‌ డ్రైవింగ్‌తో దేశవ్యాప్తంగా... ఏడాదిలో 1,040 మంది మృతి

2 Jan, 2023 05:57 IST|Sakshi

న్యూఢిల్లీ: సెల్‌ఫోన్‌లో మాట్లాడుకుంటూ వాహనాలను నడిపిన కారణంగా జరిగిన ప్రమాదాల్లో 2021లో 1,040 మంది మృతి చెందారు. అదేవిధంగా, రెడ్‌లైట్‌ పడినా పట్టించుకోకుండా వాహనాలను ముందుకు పోనివ్వడంతో 555 రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుని, 222 మంది ప్రాణాలు కోల్పోయారు.

రోడ్లపై గుంతల కారణంగా 3,625 ప్రమాదాలు జరగ్గా, 1,481 మంది మృత్యువాతపడ్డారు. 2021కి సంబంధించి కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ ఇటీవల వెల్లడించిన నివేదిక ఈ అంశాలను పేర్కొంది. 2021లో దేశవ్యాప్తంగా మొత్తం 4,12,432 రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకోగా 1,53,972 మంది చనిపోగా, 3,84,448 మంది గాయపడినట్లు ఆ నివేదిక తెలిపింది. 

మరిన్ని వార్తలు