కూల్‌ డ్రింక్‌ తాగిన మైనర్‌ బాలిక.. కాసేపటికే నీలిరంగులోకి..

5 Aug, 2021 15:47 IST|Sakshi

చెన్నై: కూల్‌డ్రింక్‌ తాగిన ఒక మైనర్‌ బాలిక.. కాసేపటికే కిందపడిపోయి అపస్మారక స్థితిలోనికి చేరుకుంది. చెన్నైలో చోటుచేసుకున్న ఈ విషాదకర సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఈ సంఘటన బసంత్‌నగర్‌ ప్రాంతంలో జరిగింది. కాగా, తరణి, అశ్విని ఇద్దరు అక్కచెల్లెలు. వీరిద్దరు తమ కుటుంబంతో కలిసి బసంత్‌నగర్‌లోని అపార్ట్‌మెంట్‌లో  ఉంటున్నారు. ఈ క్రమంలో, 13 ఏళ్ల తరణి గడిచిన మంగళవారం(ఆగస్టు3)న మధ్యాహ్నం తమ ఇంటికి దగ్గరలో ఉన్న ఒక షాప్‌కు వెళ్లి కూల్‌ డ్రింక్‌ తెచ్చుకుంది. కాసేపటి తర్వాత..  తరణి కూల్‌ డ్రింక్‌ తాగింది.

అప్పటి వరకు బాగానే ఉన్న తరణి ఒక్కసారిగా కిందపడిపోయింది. కాసేపటికే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఆమెను ఎంత కదిలించిన ఉలుకు.. పలుకులేదు. ఈ అనుకొని ఘటనతో అశ్విని షాక్‌కు గురయ్యింది. కాగా,  వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించింది. దీంతో వారు, హుటాహుటిన దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో.. తరణిని పరీక్షీంచిన వైద్యులు అప్పటికే చనిపోయినట్టు తెలిపారు. యువతి శరీరం కూడా.. నీలిరంగులోకి మారింది. తరణి మృత దేహన్ని పోస్ట్‌ మార్టంకు తరలించారు. కాగా, యువతి ఊపిరితిత్తులలో కూల్‌ డ్రింక్‌ ఆనవాళ్లు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఆ పానీయంలో​.. ఏదైన ప్రమాదకర రసాయనాలు ఉన్నాయా.. అనే కోణంలో పరీక్షలు నిర్వహిస్తున్నారు.  

ప్రస్తుతం.. ఈ సంఘటన స్థానికంగా కలకలంరేపింది. కాగా, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు, పోలీసులు, ఫుడ్‌ సేఫ్టీ అధికారులు దుకాణంపై దాడిచేసి.. షాపును సీజ్‌ చేశారు. అక్కడ ఉన్న 540 కూల్‌డ్రింక్‌ బాటిల్స్‌ను స్వాధీనం చేసుకుని పరీక్షల కోసం లాబ్‌కు తరలించారు. అయితే, ఇప్పటి వరకు ఆ దుకాణంలో 17 కూల్‌డ్రింక్‌ బాటిల్స్‌ను అమ్మినట్లు గుర్తించారు. ఆ షాపును అధికారులు సీజ్‌ చేశారు. కాగా, ధరణి గతంలో అస్తమాతో బాధపడేదని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు