మంత్రితో పాటు కుమార్తెల‌కు కోవిడ్-19

7 Aug, 2020 11:36 IST|Sakshi

సిమ్లా: హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌లో గ‌డిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. గురువారం ఒక్క‌రోజే అత్య‌ధికంగా 131 మందికి క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యింది. వీరిలో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి సుఖ్ రాం చౌదరితో పాటు ఆయన ఇద్దరు కుమార్తెలకు కూడా కోవిడ్ ఉన్న‌ట్లు తేలింది. గత కొన్ని రోజులుగా త‌న‌తో స‌న్నిహితంగా ఉన్న వారంద‌రూ క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని మంత్రి కోరారు.

క‌రోనా చికిత్స నిమిత్తం మంత్రి, వారి కుమార్తెల‌ను సిమ్లాలోని కొవిడ్ కేర్ సెంటరుకు తరలించిన‌ట్లు వైద్యఆరోగ్యశాఖ అదనపు చీఫ్ సెక్రటరీ ఆర్డీ థీమాన్ తెలిపారు. మంత్రి త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షిస్తూ సీఎం జైరాం ఠాకూర్ ట్వీట్ చేశారు. హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో మొత్తం న‌మోదైన క‌రోనా కేసుల సంఖ్య 1965కి చేరుకోగా, 13 మంది మ‌ర‌ణించారు. రాష్ర్ట వ్యాప్తంగా అత్య‌ధికంగా సోల‌న్ ప్రాంతంలో 383, మండిలో 145 కేసులు న‌మోద‌య్యాయి. 

మరిన్ని వార్తలు