మహారాష్ట్రలో 10,163 మంది పోలీసులకు కరోనా

6 Aug, 2020 15:46 IST|Sakshi

ముంబై :  మహారాష్ట్రలో కరోనా మహమ్మారి మరణమృదంగం మోగిస్తోంది. ఇక విధుల్లో ఉన్న పోలీసులు కరోనాకు ఎక్కువగా గురి అవ్వడం కలవరపెడుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 137 మంది పోలీసులు ఈ వైరస్‌ బారిన పడగా, మరో ఇద్దరు పోలీసులు వైరస్‌ సోకి మరణించారు. దీంతో మహారాష్ట్రలో ఇప్పటి వరకు వైరస్‌ సోకిన పోలీసుల సంఖ్య 10,163కి చేరగా, మృతుల సంఖ్య 109కి చేరింది. కరోనా నుంచి 8189 మంది కోలుకోగా, 1,865 మంది చికిత్స పొందుతున్నారని మహారాష్ట్ర పోలీసులు తెలిపారు.(భారీ వర్షాలతో ముంబై అతలాకుతలం)

కరోనా పోరులో ముందున్న ముంబై పోలీసులకు కరోనా సోకుతుండటంతో వారి కోసం ప్రత్యేక ఐసొలేషన్‌ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. మహారాష్ట్రలో మొత్తంగా కరోనా కేసుల సంఖ్య 4.58 లక్షలు దాటగా, ఇప్పటి వరకు 16,476 మంది చనిపోయారు. (కరోనా: భారత్‌లో 40 వేలు దాటిన మరణాలు)

మరిన్ని వార్తలు