ఒక్కరోజులో 10 వేల కేసులు, లాక్‌డౌన్ ప్రకటించిన ఒడిశా సీఎం

2 May, 2021 13:50 IST|Sakshi

భువనేశ్వర్‌: రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో 14 రోజుల పాటు లాక్‌ డౌన్‌ విధిస్తున్నట్లు ఒడిశా ప్రభుత్వం ప్రకటించింది. మే 5 నుంచి మే 19వరకు లాక్‌ డౌన్‌ విధిస్తున్నట్లు ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ ప్రకటించారు. రోజూ వేల సంఖ్యలో కరోనా కొత్త కేసులు నమోదవుతుండటంతో సీఎం లాక్‌డౌన్‌కే మొగ్గుచూపారు. ఎమర్జెన్సీ సర్వీసులు మినహాయించి లాక్‌ డౌన్‌ పై ఆంక్షలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు.

కాగా, ఇప్పటికు ఒడిశాలో 4.62 లక్షల మందికి కరోనా సోకగా 3 లక్షల 85వేల మంది కోలుకున్నారు. 2,043 మంది మహమ్మారికి బలయ్యారు. అయితే రికార్డు స్థాయిలో శనివారం ఒక్కరోజే 10,413 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో సీఎం నవీన్‌ పట్నాయక్‌ ఆరోగ్యశాఖ అధికారులు, మంత్రులతో ఆదివారం  అత్యవసర భేటీ నిర్వహించారు. ఈ భేటీ అనంతరం రాష్ట్రంలో లాక్‌ డౌన్‌ విధిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.  

మరిన్ని వార్తలు