1,472 ఐఏఎస్, 864 ఐపీఎస్‌ ఖాళీలు: కేంద్రం

15 Dec, 2022 09:17 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 1,472 ఐఏఎస్, 864 ఐపీఎస్, 1,057 ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీసు(ఐఎఫ్‌ఎస్‌) పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రకటించింది. 2022 జనవరి 1వ తేదీ నాటికి దేశంలో శాంక్షన్డ్‌ ఐఏఎస్‌ పోస్టులు 6,789, ఐపీఎస్‌ పోస్టులు 4,984, ఐఎఫ్‌ఎస్‌ పోస్టులు 3,191 ఉన్నాయని కేంద్ర సిబ్బంది వ్యవహారాల సహాయ మంత్రి జితేంద్రసింగ్‌ బుధవారం సభలో లిఖితపూర్వకంగా తెలియజేశారు. ప్రస్తుతం 5,317 ఐఏఎస్‌ అధికారులు, 4,120 ఐపీఎస్‌ అధికారులు, 2,134 ఐఎఫ్‌ఎస్‌ అధికారులు పనిచేస్తున్నారని వెల్లడించారు. ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామన్నారు. 

ప్రభుత్వ విభాగాల్లో 9.79 లక్షల ఖాళీలు 
కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో 2021 మార్చి 1 నాటికి ఏకంగా 9.79 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు జితేంద్ర సింగ్‌ లోక్‌సభకు లిఖితపూర్వకంగా తెలియజేశారు. వీటి భర్తీకి ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. 

చదవండి: (భార్య వేధింపులు తట్టుకోలేక.. నవ వరుడు ఆత్మహత్య!)

మరిన్ని వార్తలు