150 నదుల జలాలతో అయోధ్యకు..

3 Aug, 2020 04:33 IST|Sakshi
రాధేశ్యామ్‌ పాండే, శబ్ద్‌ వైజ్ఞానిక్‌

న్యూఢిల్లీ/అయోధ్య: అయోధ్యలో భవ్య రామాలయం ఈ సోదరుల కల. అది నెరవేరుతుందనే విశ్వాసం నిలువెల్లా నింపుకుని దేశంతోపాటు శ్రీలంకలోని సముద్ర, నదీ జలాలతో పాటు పవిత్ర ప్రదేశాల్లో మట్టిని వీరు సేకరిస్తూ వచ్చారు. ఈ క్రతువును ప్రారంభించిన రాధేశ్యామ్‌ పాండే, శబ్ద్‌ వైజ్ఞానిక్‌ మహాకవి త్రిఫల అనే ఈ అన్నదమ్ముల వయస్సు 70ఏళ్లుపైనే. ఇప్పటివరకు 150కిపైగా నదుల జలాలను సేకరించి, భద్రపరిచారు. చివరికి వారి కల నిజమైంది. మందిర నిర్మాణం ఖాయమైం ది. తాము సేకరించిన జలాలను, మట్టిని తీసుకుని  ఆదివారం అయోధ్యకు చేరుకున్నారు. ‘శ్రీరాముని కృపతో మా కల ఫలించింది. 151 నదులు, 8 మహానదులు, 3 సముద్రాల నీటితోపాటు శ్రీలంకలోని 16 పవిత్ర ప్రదేశాల మట్టిని సేకరించాము. వీటి కోసం 1968 నుంచి 2019 వరకు కాలినడకన, సైకిల్, బైక్, రైలు, విమాన ప్రయాణాలు చేశాము. వీటిని  ఆ రాముడికి అర్పించుకుంటాం’అని వారు తెలిపారు.

మందిరంతో సోదరభావం, సామరస్యం
మందిరం ఉద్యమం కారణంగా రాజకీయంగా, సామాజికంగా ఏర్పడిన అంతరం, మందిరం నిర్మాణంతో సమసిపోతుందని ఆలయ ట్రస్టు సభ్యుడు కామేశ్వర్‌ చౌపాల్‌ చెప్పారు. ‘అయోధ్యలో భూమిపూజ రామరాజ్యానికి పునాది కానుంది. శ్రీరాముని జీవితం సోదరభావం, సామరస్యాలతో ముడిపడి ఉంది. ఆలయ నిర్మాణంతో ఇవే విలువలు∙సమాజంలో పెంపొందుతాయి’అన్నారు.   

అయో«ధ్యలో ఆలయ పరిసరాలను శానిటైజ్‌ చేస్తున్న సిబ్బంది

మరిన్ని వార్తలు