ఆ ఇంజక్షన్‌ ఖరీదు పదహారు కోట్లు.. ఇస్తేనే ప్రాణం నిలబడేది ?

20 Jul, 2021 11:02 IST|Sakshi

వయస్సు పదహారు నెలల పసితనం... సమస్య అంతు చిక్కని వ్యాధి.. పరిష్కారం రూ. 16 కోట్ల విలువైన ఇంజెక్షన్‌. ఇప్పుడు కావాల్సింది మనందరి సహకారం. అవును 16 నెలల పాలబుగ్గల ఆయాన్ష్‌ బతకాలంటే మనవంతు సాయం తప్పనిసరిగా మారింది.

పన్నెండేళ్లకు
వందన, మదన్‌ దంపతులకు పెళ్లై చాలా ఏళ్లైనా  పిల్లలు కలగలేదు. టీసీఎస్‌ ఉద్యోగిగా పెద్దగా ఆర్థిక ఇబ్బందులు లేని ఆ కుటుంబానికి సంతాన లేమి ఒక్కటే తిరని లోటుగా మారింది. పండండి బిడ్డ కోసం తిరగని ఆస్పత్రి లేదు మొక్కని దేవుడు లేడు. చివరికి వారి మొర ఆలకించి పన్నెండేళ్ల తర్వాత వారికి మగ బిడ్డ కలిగాడు. ఆ బిడ్డకు ఆయాన్ష్‌గా పేరు పెట్టుకుని ఆ పిల్లాడే లోకంగా .. అతని ఆలనా పాలానే జీవితంగా వందన బతుకుతోంది.

 
గుండె పగిలే నిజం
ఏడాది గడిచిన తర్వాత కూడా తల్లి పాలు తాగడానికి ఊపిరి తీసుకోవడానికి ఆయాన్ష్‌ ఇబ్బంది పడేవాడు. అనుమానం వచ్చిన ఆ దంపతులు వెంటనే వైద్యులను సంప్రదిస్తే గుండె పగిలే నిజం తెలిసింది. ఆయాన్ష్‌ను పరీక్షించిన డాక్టర్లు.. స్పైనల్‌ మస్క్యులర్‌ ఆట్రోఫీ (ఎస్‌ఎంఏ) అనే అరుదైన వ్యాధిగా గుర్తించారు. పది వేల మంది పిల్లలలో ఒక్కరికి ఈ తరహా సమస్య వస్తుంది. ఈ వ్యాధి బారిన పడ్డవారు సరిగా కూర్చోలేరు, నిలబడలేరు. ఎప్పుడూ నేలపైనే పడుకుని ఉంటారు. అలాగే వదిలేస్తే వేగంగా మృత్యువుకి చేరువ అవుతారు.

రూ. 16 కోట్లు
స్పైనల్‌ మస్క్యులర్‌ ఆట్రోఫీ (ఎస్‌ఎంఏ) చికిత్సకు ఔషధాలు ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడా లేవు. వైద్యులు అంతా గాలించగా కేవలం అమెరికాలోనే జోల్జెన్స్మా అనే ఔషధం అందుబాటులో ఉన్నట్టుగా తేలింది. ఆ ఇంజక్షన్‌ ధర 2.14 మిలియన్‌ డాలర్లు అంటే మన కరెన్సీలో అక్షరాల పదహారు కోట్ల రూపాయాలు. అంత ఖరీదైన మందు కొనే స్థోమత వందనా మదన్‌ దంపతులకే కాదు మన దేశంలో ఏ మధ్య తరగతి కుటుంబానికి కూడా ఉండదు. (Advertorial​​​​​​​)

చేయిచేయి కలుపుదాం
ఓవైపు కన్న కొడుకును కబళిస్తున్న వ్యాధి, మరోవైపు చికిత్సకు అవసరమైన డబ్బు సర్థుబాటు చేయలేక ఆ తల్లిదండ్రులు సతమతం అవుతున్నారు. ఆయాన్ష్‌ మరణానికి చేరువ అవుతున్నారు. వారి ఇబ్బందిని చూసి బాలుడి చికిత్సకు అవసరమైన ఔషధం కొనేందుకు ఫండ్‌ రైజింగ్‌ సంస్థ కెట్టో ప్రయత్నాలు ప్రారంభించింది.  సోనూసూద్‌, ఫర్హాన్‌ అక్తర్‌ వంటి సినీ ప్రముఖులను, కొందరు వ్యాపారవేత్తలను సంప్రదించింది. కొంత వరకు డబ్బు సమకూరింది. అయితే కావాల్సిన మొత్తం రూ. 16 కావడంతో ఇంకా సాయం కావాల్సిన అవసరం ఉంది. మనం చేసే చిన్న సాయం చిన్నారి ఆయాన్ష్‌ ఈ అందమైన లోకాన్ని చూసే అవకాశం కల్పిస్తుంది. ఆయాన్‌కి సాయం చేయాలనుకునే వారు కింద ఇచ్చిన లింక్‌ను క్లిక్‌ చేయండి. ఇక్కడ క్లిక్ చేయండి

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు