దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు.. మరో 28 మంది మృతి

6 Jul, 2022 13:37 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 16,159 కరోనా కేసులు వెలుగుచూశాయి. వైరస్ కారణంగా మరో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 4,35,47,809కి చేరింది. మొత్తం మరణాల సంఖ్య 5,25,270కి పెరిగింది. క్రితం రోజుతో పోల్చితే కొత్త కేసుల సంఖ్య 737 పెరిగింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,15,212 యాక్టివ్ కేసులున్నాయి.

కరోనా బారినపడినవారిలో 98.53 శాతం మంది కోలుకున్నారు.  యాక్టివ్ కేసుల శాతం 0.26గా ఉంది. మరణాల శాతం 1.21గా నమోదైంది. రోజూవారి పాజిటివిటీ రేటు 3.56శాతం కాగా.. వీక్లీ పాజిటివిటీ రేటు 3.54శాతంగా ఉంది.

కేంద్ర ఆరోగ్య శాఖ వివరాల ప్రకారం బుధవారం ఉదయం నాటికి దేశవ్యాప్తంగా 198.20 కోట్ల టీకా డోసులు పంపిణీ చేశారు. మంగళవారం నిర్వహించిన 4,54,465 కరోనా పరీక్షలతో కలిపి మొత్తం పరీక్షల సంఖ్య 86.49 కోట్లకు చేరింది.

మరిన్ని వార్తలు