విజృంభిస్తున్న కరోనా: కొత్తగా వెయ్యికిపైగా మరణాలు 

14 Apr, 2021 10:31 IST|Sakshi

గడచిన 24 గంటలలో 1,85,190 కేసులు

1026 మరణాలు 

సాక్షి, న్యూఢిల్లీ:  దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది.  కేంద్ర మంత్రిత్వ శాఖ బుధవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశ వ్యాప్తంగా గడచిన 24 గంటలలో 1,85,190 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.  రోజువారీ కేసుల నమోదుకు  సంబంధించి ఇది సరికొత్త గరిష్టం. అంతేకాదు వరుసగా నాలుగవ రోజు కూడా లక్షన్నరకు పైగా కేసులు నమోదయ్యాయి. అలాగే ఈ  ఏడాదిలో మరణాల సంఖ్య కూడా వెయ్యిదాటేసింది. గడచిన 6 నెలల తరువాత దేశంలో అత్యధిక సంఖ్యలో 1026 మరణాలు నమోదు కావడం గమనార్హం. (వ్యాక్సిన్‌ వికటించి వ్యక్తి మృతి?)

ఇప్పటికే కరోనా ఉధృతి తీవ్రంగా ఉన్న మహారాష్ట్రలో 60,212 కొత్త కరోనా ఇన్ఫెక్షన్లు (కొత్త కేసులలో 32శాతం  ఉన్నాయి), ఉత్తర ప్రదేశ్ 18,021 కేసులు, ఢిల్లీలో 13,468 కొత్త కరోనా ఇన్ఫెక్షన్ల కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటివరకు మొత్తం 1,38,52,599 కేసులు నమోదుగా కాగా  1,71,929 మరణాలు సంభవించాయి. కరోనా కేసుల్లో   భారత్‌ ఇప్పటికే  బ్రెజిల్‌ను అధిగమించిన సంగతి తెలిసిందే.13.52 మిలియన్ల సంచిత కేసులతో ఉన్న బ్రెజిల్ ప్రస్తుతం రోజుకు సగటున 72,000కేసులుబ్రెజిల్ రోజుకు సగటున 3,100 కంటే ఎక్కువ మరణాలను నమోదు ఏప్రిల్ 11 నాటికి, బ్రెజిల్ మొత్తం 3,54,617 మరణాలను నమోదు చేసింది, ఇది భారతదేశం కంటే రెండు రెట్లు ఎక్కువ. ఏప్రిల్ 13 న ఉదయం 7 గంటల వరకు భారతదేశంలో 10,85,33,085 వ్యాక్సిన్ మోతాదులను అందించినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.  (భారీ ఊరట: మూడో వ్యాక్సిన్‌ అందుబాటులోకి)

తెలంగాణాలో కేసులు
తెలంగాణలో కరోనా కేసులు నమోదు పెరుగుతూ పోతోంది. రాత్రి 8 గంటల వరకు మొత్తం 72,364 కరోనా టెస్టులు నిర్వహించగా 2157 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,34,738కి చేరింది. ఎనిమిది మంది కరోనాతో మృతి చెందడంతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 1780కి చేరింది. 3,07,499 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 25,459 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.

మరిన్ని వార్తలు