వైరల్‌: చేప కడుపులో 10 కేజీల ప్లాస్టిక్‌ బ్యాగ్‌

27 Mar, 2021 16:31 IST|Sakshi
వీడియో దృశ్యాలు

బెంగళూరు : చేప కడుపులో పేపర్లతో కూడిన 10 కేజీల(10 కేజీలకు సరిపోయే) ప్లాస్టిక్‌ బ్యాగ్‌ బయటపడింది. ఈ సంఘటన కర్ణాటకలోని మంగళూరులో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు.. గత సోమవారం మంగళూరు, అట్టవర్‌లోని చేపల మార్కెట్‌లోని ఓ షాపులో ఓ వ్యక్తి రీఫ్‌ కోడ్‌ చేపను కోస్తున్నాడు. ఈ నేపథ్యంలో దాని కడుపులో ప్లాస్టిక్‌ బ్యాగ్‌ ఉండటం గుర్తించి షాక్‌కు గురయ్యాడు. ఈ విషయాన్ని తన యజమానికి చెప్పాడు. దీంతో అతను దాన్ని వీడియో తీసి, ఆన్‌లైన్‌లో షేర్‌ చేద్దామని నిశ్చయించుకున్నాడు. పనివాడు వ్యక్తి చేప కడుపు కోసి ప్లాస్టిక్‌ బ్యాగ్‌ను బయటకు తీశాడు. అనంతరం దాన్ని ఓపెన్‌ చేసి చూడగా కొన్ని పేపర్లు బయటపడ్డాయి. అది 10 కేజీల ప్లాస్టిక్‌ బ్యాగ్‌గా వారు గుర్తించారు. దీనిపై షాపు యజమాని మాట్లాడుతూ.. ‘‘నేనిలాంటిది చూడటం ఇదే ప్రథమం. మనుషులు ఇలాగే ప్లాస్టిక్‌ను సముద్రాలలో పడేయటం వల్ల చేపల సంతానోత్పత్తి బాగా దెబ్బ తింటుంది.

చేపలు తినే వాటిపై చాలా శ్రద్ధ వహిస్తాయి. అయితే సముద్రపు తీర ప్రాంతాలు ఎక్కువగా ప్లాస్టిక్‌తో నిండి ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో 40-50 శాతం చేపల వలలు ప్లాస్టిక్‌ను పట్టుకుంటున్నాయి. కానీ, ఈ సంఘటనలో ప్లాస్టిక్‌ తిన్న చేపను వలలు బంధించాయి. చేపలు మామూలుగా చిన్న చిన్న ప్లాస్టిక్‌ ముక్కలను తింటుంటాయి. అవి వాటి శరీరాన్ని విషమయం చేస్తున్నాయి. చాలా వరకు ప్లాస్టిక్‌ చెత్త కాలువలు, నదుల ద్వారా సముద్రాల్లో కలుస్తోంది. ఆ చెత్తను సముద్రాల్లో కలవకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి’’ అని కోరారు.

చదవండి, చదివించండి : వ్వావ్‌! 4 వేల ఏళ్ల క్రితమే మల్టీ గ్రేయిన్‌ లడ్డూలు..

>
మరిన్ని వార్తలు