Telugu Top News: మార్నింగ్‌ హైలైట్‌ న్యూస్‌

1 Dec, 2022 10:10 IST|Sakshi

1. జన సునామీ.. మదనపల్లె చరిత్రలో ఇదే ప్రథమం
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ రాకతో మదనపల్లె కిక్కిరిసింది. సభా ప్రాంగణం, రోడ్లన్నీ కిటకిటలాడాయి.  ఇంత వరకు ఏ రాజకీయ నేతకు, ముఖ్యమంత్రికి దక్కని ఘన స్వాగతం, జన నీరాజనం ఆయనకు లభించింది. 
👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

2. చిన్నారి పరిస్థితి చూసి చలించిపోయిన సీఎం జగన్‌
మదనపల్లెలో బుధవారం సీఎం వస్తున్న దారిలో హమీదా అనే మహిళ తన ఏడాదిన్నర వయసున్న చిన్నారిని చేతులపైకి ఎత్తుకుని ‘జగనన్నా.. నా బిడ్డను కాపాడన్నా’ అని వేడుకుంది. బస్సులో నుంచి ఆ దృశ్యం గమనించిన సీఎం.. ఆమెను సభాస్థలి వద్దకు పిలిపించారు.
👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

3. కవిత, షర్మిల ట్వీట్ల యుద్ధం
టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల.. ట్విట్టర్‌ వేదికగా పరస్పర విమర్శనాస్త్రాలు సంధించుకున్నారు.
👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

4.పేదల బియ్యంతో కోట్లకు పడగ
రాష్ట్రంలో రేషన్‌ బియ్యం దందా ఓ మాఫియాగా తయారైంది. గ్రామాలు, పట్టణాల్లోని బస్తీల నుంచి సేకరించే బియ్యాన్ని రాష్ట్ర సరిహద్దులు దాటించాలన్నా, రైస్‌ మిల్లులకు చేరవేయాలన్నా.. జిల్లాల స్థాయిలో కొందరు వ్యక్తులు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలుస్తోంది.
👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

5.గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు.. కొనసాగుతున్న తొలి విడత పోలింగ్‌
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రారంభమైంది. 89 నియోజకవర్గాల్లో ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించునేందుకు పోలింగ్ స్టేషన్లకు చేరుకుంటున్నారు.
👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

6. భారత్‌లో అబ్బాయిలకే కేన్సర్‌ వ్యాధి ఎక్కువ
భారత్‌లో అమ్మాయిల కంటే అబ్బాయిలే అధికంగా కేన్సర్‌ బారిన పడుతున్నారని లాన్సెట్‌ తాజా నివేదిక వెల్లడించింది. సమాజంలో లింగ వివక్షే దీనికి కారణమై ఉండవచ్చునని అభిప్రాయపడింది. 
👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

7.ఐసిస్‌ చీఫ్ హతం.. కొత్త అధినేతను ప్రకటించిన ఇస్లామిక్ స్టేట్..
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ అధినేత హసన్ అల్ హషిమీ అల్ ఖురేషి హతమయ్యాడు. సిరియా తిరుగుబాటు శక్తులతో జరిగిన భీకర పోరులో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయాన్ని ఐసిస్ బుధవారం ఓ ఆడియో సందేశంలో తెలిపింది.
👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

8. జొమాటోకు అలీబాబా ఝలక్‌, భారీగా షేర్ల అమ్మకం
చైనాకు చెందిన అలీబాబా కంపెనీ అలీపే ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోలో తనకున్న వాటాల నుంచి 3.07 శాతాన్ని (26,28,73,507 షేర్లు) విక్రయించింది. ఓపెన్‌ మార్కెట్‌ లావాదేవీల రూపంలోనే ఈ విక్రయం జరిగింది.
👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

9.పెళ్లిపై సంచలన వ్యాఖ్యలు చేసిన మాలీవుడ్‌ బ్యూటీ
మాలీవుడ్‌ బ్యూటీ ఐశ్వర్యలక్ష్మి మలయాళంతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ చిత్రాలు చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది. గార్గీ వంటి సక్సెస్‌ఫ/ల్‌ చిత్రంతో నిర్మాతగానూ మారారు. ఇటీవల అమ్ము అనే చిత్రంతో టైటిల్‌ పాత్ర పోషించింది. ఇది ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయి మంచి పేరును తెచ్చిపెట్టింది.
👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

10. డిపెండింగ్‌ చాంపియన్‌ ఫ్రాన్స్‌కు ఊహించని షాక్‌! కానీ..
వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచి అందరి కంటే ముందుగా ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ బెర్త్‌ సంపాదించిన ఫ్రాన్స్‌ జట్టుకు ఊహించని షాక్‌ తగిలింది. గ్రూప్‌ ‘డి’ చివరి లీగ్‌ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌కు అనూహ్య పరాజయం ఎదురైంది.
👉: పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు