కూలిన గ్లైడర్‌‌.. ఇద్దరు నేవీ సిబ్బంది మృతి

5 Oct, 2020 07:57 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

తిరువనంతపురం: నేవీ పవర్‌ గ్లైడర్‌ కూలిన ప్రమాదంలో ఇద్దరు నేవీ సిబ్బంది మరణించిన ఘటన ఆదివారం ఉదయం కేరళలోని తొప్పంపడీ బ్రిడ్జి వద్ద చోటుచేసుకుంది. రొటీన్‌ ట్రైనింగ్‌లో భాగంగా విధులు నిర్వహిస్తూ ఉన్న సమయంలో ప్రమాదం జరిగిందని రక్షణ శాఖ అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన లెఫ్టినెంట్‌ రాజీవ్‌ ఝా, పెట్టీ ఆఫీసర్‌ సునీల్‌ కుమార్‌లను ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రికి తీసుకెళ్లేసరికే వారు మరణించారని వైద్యులు తెలిపారు. రాజీవ్‌కు ఇద్దరు పిల్లలు ఉన్నారని, సునీల్‌కు పెళ్లి కాలేదని అధికారులు చెప్పారు ఈ ఘటనపై దక్షిణ నేవీ కమాండ్‌ విచారణకు ఆదేశించింది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు