ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

24 Jul, 2021 11:04 IST|Sakshi
భద్రతా దళాలు

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లోని బండిపోరా జిల్లాలో శనివారం భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు గుర్తు తెలియని ఉగ్రవాదులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఉత్తర కశ్మీర్‌లోని బండిపోరాలో సుంబ్లార్ ప్రాంతంలోని షోక్‌బాబా అడవిలో ఉగ్రవాదులు ఉన్నట్లు భద్రతా దళాలు సమాచారం అందుకున్నట్లు పోలీసు అధికారి తెలిపారు. అయితే ఉగ్రవాదుల కోసం వెతుకుతుండగా.. ఉగ్రవాదులు వారిపై కాల్పులు జరిపారు. దీంతో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. 


కాగా గత వారం రోజుల్లోనే ఈ లోయలో పలు ఎన్‌కౌంటర్లు జరిగిగాయి. బారాముల్లాలోని సోపోర్‌లోని వార్పోరా గ్రామంలో శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు లష్కరే తోయిబా (ఎల్‌ఇటీ) ఉగ్రవాదులు మరణించారు.  వారి నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రి, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. ఇక జమ్మూ కశ్మీర్‌లోని షోపియన్‌లో భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో సోమవారం లష్కరే తోయిబా ఉగ్రవాది, మరో గెరిల్లా మృతి చెందారు.
 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు