చిన్నారి గొంతులో ఇరుక్కున్న ఉంగరం

2 Jul, 2021 08:29 IST|Sakshi
చిన్నారి మదిమాల, ఎక్స్‌రేలో కనిపిస్తున్న ఉంగరం

చెన్నై: చిన్నారి గొంతులో చిక్కుకున్న ఉంగరాన్ని శివగంగై వైద్యులు తొలగించి రికార్డు సాధించారు. శివగంగై ప్రభుత్వ వైద్యకళాశాల ఆస్పత్రి డీన్‌ రేవతి బుధవారం విలేకరులతో మాట్లాడుతూ మదురై మూకు ప్రాంతానికి చెందిన కళాశాల ప్రొఫెసర్‌ రామ్‌ప్రసాద్, నిరంజన దంపతుల కుమార్తె మదిమాల (02), ఇటీవల నిరంజన్‌ ధరించిన నాలుగు గ్రాముల బంగారు ఉంగరం జారి పడిపోవడంతో దాన్ని మింగేసిందని, తర్వాత కొద్దిసేపట్లో ఊపిరాడక వాంతి చేసిందన్నారు. దీంతో బిడ్డను శివగంగై పభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తీసుకెళ్లడంతో వెంటనే ఎక్స్‌రే తీశారని, దీంతో ఆహార నాలిక పైభాగంలో ఉంగరం ఉన్నట్లు తెలిసిందన్నారు.

చిన్నారి ఉంగరాన్ని మింగడానికి ముందు ఆహారం తీసుకోవడంతో వెలికి తీయడానికి ఆటంకం ఏర్పడింది. మరుసటిరోజు ఉదయం మత్తు మందు ఇచ్చి వీడియో ఆప్టికల్‌ ఫోర్సెప్స్, రిజిడ్‌ ఎండోస్కోపీ ద్వారా ఉంగరాన్ని వెలికి తీసినట్లు తెలిపారు. ప్రస్తుతం బిడ్డ బాగుండడంతో గురువారం డిశ్చార్జ్‌ చేశారు. సమావేశంలో ఆస్పత్రి సూపరింటెండెంట్‌ బాలమురుగన్, ఈఎన్‌టీ విభాగం హెడ్‌ నాగసుబ్రహ్మణ్యన్, ఆర్‌ఎంఓ రఫీ, వైద్యులు ఆనంద్, వైరవరాజన్, సుందరపాండియన్‌ వెంట ఉన్నారు. 

మరిన్ని వార్తలు