22 ఏళ్ల క్రితం.. పునీత్‌ రాజ్‌కుమార్‌ తండ్రిని కిడ్నాప్‌ చేసిన వీరప్పన్‌

29 Oct, 2021 20:03 IST|Sakshi

22 ఏళ్ల క్రితం కన్నడ సూపర్‌ స్టార్‌, పునీత్‌ రాజ్‌కుమార్‌ తండ్రి రాజ్‌కుమార్‌ కిడ్నాప్‌

వీరప్పన్‌ చెరలో 108రోజులు బందీగా ఉన్న రాజ్‌కుమార్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: కన్నడ పవర్‌ స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ శుక్రవారం మృతి చెందారు. గుండెపోటుతో ఆయన అకాలమరణం చెందారు. వారి కుటుంబ సభ్యుల బాధ వర్ణించలేకుండా ఉంది. ఈ క్రమంలోనే అభిమానులు, ప్రజలు దాదాపు 22 ఏళ్ల క్రితం పునీత్‌ రాజ్‌కుమార్‌ కుటుంబంలో చోటు చేసుకున్న ఓ సంఘటన గురించి చర్చించుకుంటున్నారు. అదే పునీత్‌ రాజ్‌కుమార్‌ తండ్రి కిడ్నాప్‌. పునీత్‌ తండ్రి, కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్‌ను గంధపు చెక్కల దొంగ వీరప్పన్‌ కిడ్నాప్‌ చేశాడు.

వీరప్పన్‌ నేరాల్లో ఈ సంఘటన ఇప్పటికి కూడా ప్రజలను వెంటాడుతూనే ఉంటుంది. దీని గురించి ఈ జనరేషన్‌ వారికి పెద్దగా తెలియకపోవచ్చు. తమిళనాడుకు చెందిన వీరప్పన్‌ కన్నడ సూపర్‌స్టార్‌ను ఎందుకు కిడ్నాప్‌ చేశాడు.. తర్వాత ఏం జరిగింది వంటి తదితర వివరాలు..
(చదవండి: కన్నడ సూపర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ ఇకలేరు.. )

ఈ కిడ్నాప్‌ 2000 సంవత్సరం, జూలై 30న చోటుచేసుకుంది. ఈ సంఘటన జరిగిన సమయంలో తమిళనాడులో కరుణానిధి అధికారంలో ఉన్నారు. సంఘటన జరిగిననాడు.. రాజ్‌కుమార్‌.. తమిళనాడు ఈరోడ్‌ జిల్లాలోని గాజనూరు గ్రామంలో ఉన్న తన ఇంటికి వచ్చారు. అప్పటికి ఎనిమిది నెలల క్రితమే పునీత్‌ రాజ్‌కుమార్‌ వివాహం జరిగింది. 

                                                    (ఫోటో కర్టెసీ: ఇండియాటుడే)

జూలై 30, రాత్రి 09.30 గంటలకు కిడ్నాప్‌...
రాజ్‌కుమార్‌ తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి ఉన్నారు. ఆ సమయంలో వీరప్పన్‌ తన అనుచరలతో కలిసి రాజ్‌కుమార్‌ ఇంటికి వచ్చి.. ఆయనను కిడ్నాప్‌ చేశాడు. రాజ్‌కుమార్‌తో పాటు ఆయన అల్లుడు గోవింద్‌రాజ్‌, బంధువు నగేష్‌, అసిస్టెంట్‌ దర్శకుడు నాగప్పను కూడా కిడ్నాప్‌ చేశాడు. 
(చదవండి: తండ్రి సమాధి దగ్గరే పునీత్‌ అంత్యక్రియలు)

ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తమిళనాడు ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. సుప్రీంకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజ్‌కుమార్‌కు భద్రత కల్పించడంలో తమిళనాడు ప్రభుత్వం దారుణంగా విఫలమయ్యిందని.. ఇది క్షమించరాని నేరమని సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. 

                                       (ఫోటో కర్టెసీ: ఇండియాటుడే)

రాజ్‌కుమార్‌ కిడ్నాప్‌ గురించి ఏడాది ముందే సమాచారం
వీరప్పన్‌ను పట్టుకోవడం కోసం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) గంధపు చెక్కల స్మగ్లర్‌.. రాజ్‌కుమార్‌ను టార్గెట్‌ చేశాడని.. కిడ్నాప్‌కు ఏడాది ముందే అనగా.. 1999లోనే ప్రభుత్వాన్ని హెచ్చరించింది. అయినా ప్రభుత్వం రాజ్‌కుమార్‌కు భద్రత కల్పించడంలో అలసత్వం వహించడంతో సుప్రీంకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. 
(చదవండి: పునీత్‌ రాజ్‌కుమార్‌ ఆఖరి ట్వీట్‌ వైరల్‌..)

ఫలించని చర్చలు.. 108 రోజుల బందీ
రాజ్‌కుమార్‌ కిడ్నాప్‌ వ్యవహారంపై అభిమానులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలో వీరప్పన్‌తో చర్చలు జరిపింది తమిళ ప్రభుత్వం. నక్కిరన్‌ పత్రిక ఎడిటర్‌ ఆర్‌ఆర్‌ రాజగోపాల్‌ ఈ చర్చల్లో కీలక పాత్ర పోషించినప్పటికి ఫలితం లేకపోయింది. అలా 108 రోజుల పాటు రాజ్‌కుమార్‌ను బంధించిన వీరప్పన్‌.. చివరకు 2000, నవంబర్ 15న ఆయనను వదిలేశాడు. చర్చలు జరిపినా మాట వినని వీరప్పన్‌.. ఉన్నట్లుండి రాజ్‌కుమార్‌ను విడుదల చేయడం నేటికి మిస్టరీగానే మిగిలిపోయింది. 

(చదవండి: ఒక్కసారి కూడా నా తండ్రిని చూడలేదు)

19 ఏళ్ల పాటు సాగిన కేసు..
తమిళనాడు కోర్టులో రాజ్‌కుమార్‌ కిడ్నాప్‌ కేసు ఏళ్ల పాటు నడిచింది. ఈ కేసు విచారణ సమయంలో రాజ్‌కుమార్‌ కుటుంబం ఎవరిని నిలదీయలేదు. కిడ్నాప్‌ అయిన 19 ఏళ్ల తర్వాత అనగా 2018, సెప్టెంబర్‌లో కోర్టు ఈ కేసులో నిందితులుగా ఉన్న 9 మందిని నిర్దోషులుగా ప్రకటించింది. రాజ్‌కుమార్‌ కుటుంబం వీరికి వ్యతిరేకంగా ఆరోపణలు చేయకపోవడంతో.. వీరంతా నిర్దోషులుగా విడుదల అయ్యారు. 

కేసు ముగియడానికి ముందే వీరప్పన్‌, రాజ్‌కుమార్‌ రెండు ఏళ్ల తేడాతో మృతి చెందారు. సిట్‌ బృందం చేతిలో 2004లో వీరప్పన్‌ మృతి చెందగా.. 2006లో రాజ్‌కుమార్‌ మృతి చెందారు. ఇక చర్చల సమయంలో వీరప్పన్‌ తన మీద ఉన్న మొత్తం 135 కేసులును ఎత్తేయాల్సిందిగా డిమాండ్‌ చేసినట్లు సమాచారం. ఇందుకు తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాలు అంగీకరించేదట. 

చదవండి: వీరప్పన్‌కు ఇచ్చింది రూ.15 కోట్లు!

మరిన్ని వార్తలు