వెయ్యి కిలోల ప్లాస్టిక్‌ వ్యర్థాలతో మహాత్మ గాంధీ విగ్రహం

8 Aug, 2022 20:17 IST|Sakshi

లక్నో:  జాతిపిత మహాత్మాగాంధీ స్వాతంత్య్రంతో పాటు స్వచ్ఛభారత్ మిషన్‌పైనా ప్రజల్లో అవగాహన కల్పించారు. స్వచ్ఛాభారత్‌ మిషన్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మహాత్ముడి విగ్రహంతోనే అవగాహన కల్పిస్తంది ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడా నగరపాలక సంస్థ. క్విట్‌ ఇండియా ఉద్యమం 80వ వార్షికోత్సవం సందర్భంగా 20 అడుగుల మార్చింగ్‌ మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆ విగ్రహాన్ని ప‍్లాస్టిక్‌ వ్యర్థాలను రీసైకిల్‌ చేసి రూపొందించారు. హెచ్‌సీఎల్‌ ఫౌండేషన్‌ భాగస్వామ్యంతో నోయిడా అడ్మినిస్ట్రేషన్‌ సుమారు 1,000 కిలోల ప్లాస్టిక్‌ వ్యర్థాలను సేకరించి విగ్రహం తయారు చేసింది. ఈ విగ్రహాన్ని సెక్టార్‌ 137లో ఏర్పాటు చేశారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలని ప్రజలకు గుర్తు చేసేలా మహాత్ముడి విగ్రహాన్ని ప్లాస్టిక్‌ వ్యర్థాలతో ఏర్పాటు చేసినట్లు తెలిపారు అధికారులు. 

ఒకేసారి వాడి పడేసే ప్లాస్టిక్‌పై జులై 1వ తేదీ నుంచి నిషేధం విధించారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అధికారులు కృషి చేస్తూనే ఉన్నారు. మరోవైపు.. రాజస్థాన్‌లో ఖాళీ పాల ప్యాకెట్లు తీసుకొస్తే లీటర్‌ పెట్రోల్‌పై డిస్కౌంట్‌ ఇస్తున్నారు ఓ పెట్రోల్‌ పంపు యజమాని. ఒకేసారి వాడి పడేసే ప్లాస్టిక్‌ వ్యర్థాలను ఇష్టారీతిలో ఎక్కడపడితే అక్కడ పడేయకుండా అవగాహన కల్పించేందుకే ఇలా చేస్తున్నట్లు చెప్పారు అశోక్‌ కుమార్‌ ముంద్ర. 

ఇదీ చదవండి: Viral: 16 ఏళ్ల బాలుడి ముక్కు కొరికేసిన రాజకీయ నేత.. అంత కోపం దేనికో?

మరిన్ని వార్తలు