భారత్లో‌ ఎన్ని ఇళ్లలో టీవీలు ఉన్నాయో తెలుసా?

16 Apr, 2021 16:52 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఇండియాలో టీవీ వీక్షకులు 89.2 కోట్లు

టీవీలు ఉన్న గృహాలు 21 కోట్లు: బార్క్‌ 

ముంబై: ఇండియాలో టీవీ వీక్షకుల సంఖ్య ప్రతిఏటా గణనీయంగా పెరుగుతోంది. 2020 ఆఖరు నాటికి టీవీ ఉన్న ఇళ్ల సంఖ్య 6 శాతం పెరిగిందని బ్రాడ్‌కాస్ట్‌ ఆడియన్స్‌ రేటింగ్‌ కౌన్సిల్‌(బార్క్‌) గురువారం వెల్లడించింది. దేశంలో 21 కోట్ల ఇళ్లల్లో టీవీలు ఉన్నాయని పేర్కొంది. 2018 సంవత్సరాంతానికి 19.7 కోట్ల గృహాల్లో టీవీలు ఉండేవి. టీవీ సెట్ కలిగి ఉన్న మహిళల సంఖ్య 7 శాతం పెరిగింది, పురుషులు 6 శాతం పెరిగారు. 2018లో దేశంలో టీవీ చూసే వారి సంఖ్య 83.6 కోట్లు కాగా, 2020 నాటికి 89.2 కోట్లకు ఎగబాకింది. ఇండియా జనాభా దాదాపు 130 కోట్లు కాగా, దేశంలో 30 కోట్ల గృహాలు ఉన్నాయని బార్క్‌ ప్రకటించింది. 

గత ఏడాది కరోనా వైరస్‌ వ్యాప్తి, లాక్‌డౌన్‌ నేపథ్యంలో జనం ఇళ్లల్లోనే ఉండిపోవాల్సి వచ్చిందని, అందుకే టీవీ వీక్షణం పెరిగిందని తెలియజేసింది. దేశంలో ఇంకా 9 కోట్ల గృహాల్లో టీవీలు లేవని వెల్లడించింది. దేశంలో జనాభా పెరుగుతుండడంతో ప్రసార, వినోద రంగంలో వృద్ధికి మంచి అవకాశాలు ఉన్నాయని బార్క్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ సునీల్‌ లుల్లా చెప్పారు. నగర, పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లోనే టీవీ వీక్షకులు పెరుగుతుండడం గమనార్హం.  

ఇక్కడ చదవండి:
ఇది విన్నారా.. శారీరక శ్రమ లేని వారిపై కరోనా ప్రభావం ఎక్కువ

అతిపొడవైన వెంట్రుకలను కత్తిరించుకున్న టీనేజర్‌.. ఎందుకంటే?

మరిన్ని వార్తలు