కరోనా ప్రమాద ఘంటికలు: సోనూసూద్‌ స్పెషల్‌ డ్రైవ్‌

8 Apr, 2021 11:17 IST|Sakshi

కరోనా ప్రమాద ఘంటికలు : సోనూసూద్‌ ఆందోళన

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు  కీలక విజ్ఙప్తి

25 పైబడిన వారికి కూడా టీకా అందుబాటులో ఉంచాలి

సాక్షి,న్యూఢిల్లీ:  దేశంలో కరోనా వైరస్‌  కేసుల సంఖ్య  రికార్డు  స్థాయిలో  నమోదవుతూ ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ కాలంలో వలస కార్మికులను ఆదుకుని రియల్‌ హీరోగా నిలిచిన సోనూ సూద్‌ సెకండ్‌వేవ్‌లో పెరుగుతున్న కేసులపై ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో  కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు కీలక విజ్ఞప్తి చేశారు. 25 సంవత్సరాలు పైబడిన వారికి కూడా టీకాల ప్రక్రియ మొదలు పెట్టాలని కోరారు. ఎందుకంటే ఎక్కువగా 25 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసువారు, పిల్లలు కూడా  వైరస్‌ బారిన పడుతున్నారని  ఆయనపేర్కొన్నారు.

పంజాబ్,  ‌అమృత్‌సర్‌లోని ఆసుపత్రిలో బుధవారం కోవిడ్-19 వ్యాక్సిన్‌ను తీసుకున్న సోనుసూద్ వ్యాక్సినేషన్‌పై అవగాహన పెంచేందుకు, టీకా తీసుకునేలా ప్రజలను  ప్రోత్సహించడానికి "సంజీవని: ఏ షాట్ ఆఫ్ లైఫ్"  పేరుతో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు. అతిపెద్ద టీకా డ్రైవ్‌  మొదలవుతుందంటూ ఒక వీడియోను కూడా షేర్‌ చేశారు. 

కాగా దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు పలు ప్రాంతాల్లో  ఆంక్షలు కొనసాగుతున్నాయి. కేసుల సంఖ్య రోజుకో కొత్త రికార్డుతో మరింత వణికిస్తోంది. గురువారం నాటికి  అధికారిక గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో  రికార్డు స్థాయిలో 1,26,789 కేసులు నమోదు కావడం గమనార్హం.   

.

మరిన్ని వార్తలు